GST Reforms: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో పన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పులు జరిగాయి. ఇప్పుడు GSTలో కేవలం రెండు శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి, అయితే 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను పూర్తిగా రద్దు చేశారు. ఆర్థిక మంత్రి విలేకరుల సమావేశంలో, మీరు వెయ్యి రూపాయల చెప్పులు కొనుగోలు చేస్తే, మొదట ఎంత GST చెల్లించేవారు , కొత్త శ్లాబ్‌లు అమలు చేసిన తర్వాత ఎంత GST చెల్లించాలో వివరించారు.

పాదరక్షలపై ఇప్పుడు ఎంత శాతం GST ఉంటుంది?

GST కౌన్సిల్ సమావేశం తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం (సెప్టెంబర్ 3, 2025) నాడు ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ్‌తో, ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ విభాగం కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ్ పాదరక్షలపై విధించే పన్ను గురించి సమాచారం అందించారు. ఆయన మాట్లాడుతూ, 'ఇప్పటివరకు 1000 రూపాయల వరకు పాదరక్షలు కొనుగోలు చేస్తే వినియోగదారులపై 12 శాతం పన్ను విధించేవారు. 1000 రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన పాదరక్షల కొనుగోలుపై 18 శాతం GST వసూలు చేసేవారు.'

ఆయన మాట్లాడుతూ, 'ఇప్పుడు 12 శాతం పన్ను శ్లాబ్‌ను తొలగించినందున, కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం, ఇకపై 2500 రూపాయల వరకు పాదరక్షలపై 5 శాతం GST విధిస్తారు. 2500 రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన పాదరక్షలపై 18 శాతం GST విధించి వసూలు చేస్తారు .' అని అన్నారు.

#WATCH | Delhi: Arvind Shrivastava, Secretary, Department of Revenue, Ministry of Finance, says, "As far as footwear is concerned, there were two rates in the past. Those costing less than Rs 1000 were charged 12% and those costing more than Rs 1000 were charged 18%. Now,… pic.twitter.com/zKvWgUQeFo

— ANI (@ANI) September 3, 2025

చిన్న కార్ల నుంచి పెద్ద కార్ల వరకు ఎంత GST చెల్లించాలి?

ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ్ చిన్న కార్ల నుంచి పెద్ద కార్లపై విధించే GST గురించి సమాచారం పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, 'చిన్న కార్లపై 18 శాతం GST విధిస్తున్నానం . దీనితో పాటు, ఇతర అన్ని కార్లపై 40 శాతం GST వసూలు చేయడం జరుగుతుంది.' అని అన్నారు.

అయితే, చిన్న కార్లకు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా, ఏవైతే చిన్న కార్లు ఉంటాయో, వాటిపై 18 శాతం GST విధిస్తామని కూడా ఆయన అన్నారు. రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం, పెట్రోల్ 1200 CC, డీజిల్ 1500 CC కార్లను చిన్న కార్లుగా పరిగణిస్తాం. మేము దాని కోసం ఎలాంటి కొత్త ప్రమాణాలను నిర్ణయించలేదు.' అని మీడియా సమావేశంలో తెలిపారు.....