Aeroponics Potato Farming Gwalior: భారతీయ వ్యవసాయ రంగంలో మునుపెన్నడూ చూడని అద్భుతమైన ఆవిష్కరణకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగరం వేదికైంది. సాధారణంగా బంగాళదుంపలు అంటే భూమి లోపల, మట్టిలో పెరిగే పంట అని అందరికీ తెలుసు. కానీ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం ఈ సంప్రదాయాన్ని తిరగరాసింది. గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మట్టితో పని లేకుండా కేవలం గాలిలోనే బంగాళదుంపలను పండించే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

ఏరోపోనిక్స్‌ యూనిట్‌- గాలిలోనే ఆహార ఉత్పత్తి

ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రత్యేక సాంకేతికతను ఏరోపోనిక్స్‌ అని పిలుస్తారు. ఈ విధానంలో మొక్కల వేర్లు నేలలో ఉండవు. దానికి బదులుగా ఒక ప్రత్యేకమైన ఏరోపోనిక్స్ యూనిట్‌గా వేలాడుతూ ఉంటాయి. మొక్కకు కావాల్సిన పోషకాలను, నీటిని తుంపరల రూపంలో నేరుగా ఆ వేర్లకు అందిస్తారు. దీని వల్ల మొక్కలు మట్టిలో కంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. గ్వాలియర్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏరోపోనిక్స్‌యూనిట్‌ ద్వారా బంగాళదుంపల సాగులో అనూహ్య ఫలితాలు సాధించారు.

#WATCH | Gwalior, Madhya Pradesh: Rajmata Vijayaraje Scindia Agriculture University has developed a technique to grow potatoes in the air using an aeroponics unit. (05.02) pic.twitter.com/50dTf9DSa2

— ANI (@ANI) February 6, 2026

ఈ సాంకేతికత ఎందుకు ప్రత్యేకం

వ్యవసాయ భూమి తగ్గిపోతున్న ప్రస్తుతం తరుణంలో ఈ గాలిలో సాగు పద్ధతి వరప్రసాదంలా మారనుంది. దీని వల్ల మట్టి లేని ప్రాంతాల్లో, సాగుకు పనికిరాని భూములున్న ప్రాంతాల్లో ఈ పద్ధతిలో పంటలు పండించవచ్చు. మట్టి ద్వారా వచ్చే శిలీంద్రాలు, ఇతర వ్యాధుల ముప్పు ఈ విధానంలో ఉండదు. దీని వల్ల అత్యంత నాణ్యమైన రోగనిరోధక శక్తి కలిగిన బంగాళదుంప విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు. సంప్రదాయ సాగుతో పోలిస్తే ఏరోపోనిక్స్‌ విధానంలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించే ఛాన్స్ ఉంది. 90 శాతం వరకు నీటిని కూడా ఆదా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.