ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను లక్నోలోని ప్రభుత్వ నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా (Actor Govinda) కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, గోవిందా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే గోవిందా ఉన్నారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో చిన్న కారులో ట్రావెల్ చేస్తున్న వీడియో ఒకటి ఉంది.

గోవిందా వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటంటే?

Govinda Viral Video: ఇటీవల గోవిందాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన గోవిందా... టాక్సీలో కూర్చున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత అంత చిన్న కారులో తిరుగుతున్నారని, రేటు తక్కువ ఉన్న కారులో ఆయన కనిపించడం ఆశ్చర్యంగా మారింది. ఆయన పతనం ప్రారంభమైందని సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. ఆ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోండి.

గోవిందా వైరల్ వీడియో ఆగ్రా విమానాశ్రయంలో తీసినది. ఆగ్రాలో ఉన్న విమానాశ్రయం భారత వైమానిక దళానికి చెందినది. భద్రతా కారణాల దృష్ట్యా, విమానాశ్రయంలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేదు. గోవిందా కూర్చున్న కారుకు విమానాశ్రయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. కారుపై భారత ప్రభుత్వం అని కూడా రాసి ఉంది. కాబట్టి, చిన్న కారులో ప్రయాణించడం ద్వారా గోవిందా పతనం అవుతున్నారనే వాదనలు, చర్చలు పూర్తిగా తప్పు.

Also Read: Naagin Movie: సీరియలే... కానీ ఇప్పుడు సినిమాగా - వెండితెరపైకి 'నాగిన్‌'

View this post on Instagram

A post shared by ABP News (@abpnewstv)

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'తో గోవిందా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల వృత్తిపరమైన జీవితంతో పాటు గోవిందా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

Also Read: Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

కొంత కాలం క్రితం గోవిందా వివాహేతర సంబంధం గురించి వార్తలు వచ్చాయి. గోవిందా, సునీత విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే గోవిందా భార్య సునీతా అహుజా ఈ వార్తలను ఖండించారు. కానీ, సునీతా అహుజా తరచుగా గోవిందా మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. గోవిందా వివాహేతర సంబంధం గురించి వచ్చిన పుకార్లపై కూడా ఆమె స్పందించారు. ఆ వివాదం ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Also Read: Tharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్