Government Holidays in India : ప్రభుత్వ సెలవులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే.. ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా?

1 month ago 2
ARTICLE AD

Nations with the Highest Number of Official Holidays : ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ప్రభుత్వ సెలవులు ఉంటాయి. వీకెండ్స్, పండుగల సమయాలే కాకుండా కొన్ని దేశాల్లో అత్యధిక ప్రభుత్వ సెలవులు ఉంటాయి. కొన్ని దేశాలు ప్రజలు ఎక్కువ వర్క్ చేయాలని కోరుకుంటే.. కొన్ని దేశాలు మాత్రం వారాంతాల్లో సుదీర్ఘ సెలవులు ఇవ్వడాన్ని ఇష్టపడతాయి. మరికొన్ని దేశాలు మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యతనిస్తాయి. కాబట్టి ప్రభుత్వ సెలవుల సంఖ్య అనేది వారి వారి సాంస్కృతిక వైవిధ్యాలు, మతపరమైన సంప్రదాయాలు, జాతీయ వేడుకలపై ఆధారపడి ఉంటాయి. అయితే వికీపీడియా తాజా గణాంకాల ప్రకారం.. ఏ దేశంలో అత్యధిక ప్రభుత్వ సెలవులు ఉన్నాయో ఎందుకో వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

అగ్రస్థానంలో ఉన్న దేశం ఇదే

ప్రభుత్వ సెలవుల పరంగా చూస్తే భారతదేశం ప్రపంచ జాబితాలోనే అగ్రస్థానంలో ఉంది. మన దగ్గర జాతీయ, మతపరమైన, ప్రాంతీయ పండుగలతో సహా మొత్తం 42 సెలవులు ఉన్నాయి. వీటిలో 21 కేంద్ర ప్రభుత్వ సెలవులు కాగా.. మిగిలినవి రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. భారతదేశం అధికారికంగా మూడు జాతీయ సెలవులు ఉన్నాయి. అవి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి ఉన్నాయి. హోలీ, దీపావళి నుంచి ఈద్, క్రిస్మస్ వరకు.. భారతదేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక వేడుక జరుపుకోవడానికి ఎల్లప్పుడూ సెలవలు ఉంటాయి. అలాగే కొందరికి కంపెనీలు శని, ఆదివారాలు సెలవలు ఇస్తాయి. మరికొందరికి వారంలో ఒక్కరోజు మాత్రమే వీకాఫ్ ఉంటుంది. అలా అని ప్రభుత్వ సెలవులు అన్ని వాడుకొనే సౌలభ్యం కూడా అందరికీ ఉండదు.

రెండవ స్థానంలో నేపాల్

రెండవ స్థానంలో నేపాల్ ఉంది. ఇక్కడ 35 ప్రభుత్వ సెలవులు జరుపుకుంటారు. ఈ దేశ సెలవులు ఇక్కడి హిందూ బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ దసాయిన్, తిహార్, హోలీ, నారీ దివస్ వంటి పెద్ద ఉత్సవాలు అధికారిక క్యాలెండర్లో భాగం. భారతదేశంలాగానే నేపాల్ కూడా మత సామరస్యాన్ని చాటి చెప్తోంది.

ఇరాన్, మయన్మార్

ఇరాన్, మయన్మార్లలో 26 అధికారిక సెలవులు ఉన్నాయి. ఇరాన్లో, ఈద్ ఉల్ అజ్హా, నౌరోజ్, ఆషూరా వంటి ఇస్లామిక్ పండుగలకు ప్రభుత్వ సెలవులు ఉంటాయి. అదే సమయంలో మయన్మార్ జాతి, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు థింగ్యాన్ జల మహోత్సవం, బౌద్ధ వ్రతం వంటి బౌద్ధ పండుగలను కూడా జరుపుకుంటారు.

శ్రీలంక

శ్రీలంకలో కూడా 25 ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా బౌద్ధ, హిందూ, ముస్లిం, క్రైస్తవ ఉత్సవాలు జరుపుకుంటారు. వెసక్, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు.. విశ్వాసం, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

కంబోడియా

కంబోడియాలో 24 అధికారిక సెలవులు ఉన్నాయి. ఇక్కడ ఖైమర్ నూతన సంవత్సరం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి బౌద్ధ, జాతీయ పండుగలు జరుపుకుంటారు. కంబోడియా ప్రజలు ఈ సుదీర్ఘ సెలవుల సమయంలో తమ కుటుంబాలతో వేడుకలు జరుపుకోవడానికి చాలా ఇష్టపడతారు.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్​లో 22 అధికారిక ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఇందులో ఈద్, దుర్గా పూజ, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ఇస్లామిక్, హిందూ, జాతీయ పండుగలు ఉన్నాయి. ఈ దేశం క్యాలెండర్ కూడా ఇండియా వలె బహుళ మత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఇలా ప్రభుత్వ సెలవలు దేశాలను బట్టి మారుతూ ఉంటాయి. అలాగే వారి సంస్కృతులు, జాతీయ, మత పరంగా తేదీల్లో మార్పు ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వ సెలవలు అందరూ వినియోగించుకుంటున్నారా? అనే ప్రశ్న వస్తే.. కాదు అనే సమాధానం కచ్చితంగా వినిపిస్తుంది. వివిధ కారణాల వల్ల చాలామంది తమ హాలీడేలు వినియోగించుకోలేకపోతున్నారనేది వాస్తవం.

Read Entire Article