<p>న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులు, ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో భేటీలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, నారా లోకేష్ పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఒప్పందంతో విశాఖలో ఒకేసారి ఏకంగా రూ.88 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి. ఏపీలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం తెలిపింది.</p>
<p>న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1 గిగావాట్ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో భాగంగా గూగుల్ తో చేసుకున్న ఒప్పందంతో విశాఖకు 10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి.</p>
<p> </p>
<p> </p>