న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాయాది పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పీఓకే, పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అప్పటి నుండి భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటూ మరోవైపు మేకిన్ ఇండియా చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మరో ముఖ్యమైన విషయం ప్రచారం జరుగుతోంది. భారత్ త్వరలోనే ఇజ్రాయెల్ నుండి గోల్డెన్ హారిజన్ (Golden Horizon) ALBM మిస్సైల్ పొందే అవకాశం ఉంది. ఇది ఆకాశం (గగనతలం) నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (Air-Launched Ballistic Missile). ఈ మిస్సైల్ ప్రయోగిస్తే క్షణాల్లో టార్గెట్‌ను విధ్వంసం చేస్తుంది. భారత్‌లో బటన్ నొక్కితే క్షణాల్లో ఇస్లామాబాద్ బూడిద అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాక్‌లో వణుకు తప్పదు.

'ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్' నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ భారత్‌కు గోల్డెన్ హారిజన్ ALBMను ఆఫర్ చేసింది. శత్రువుల స్థావరాలపై పూర్తి స్థాయిలో దాడి చేయడంలో ఈ క్షిపణి విజయవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దీని Range, వేగం బ్రహ్మోస్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. ఒకవేళ భారత సైన్యం ఈ క్షిపణిని పొందితే కనుక, సమీపంలోని శత్రు దేశంలోని ఏ నగరాన్నైనా క్షణాల్లో నాశనం చేయవచ్చు.

గోల్డెన్ హారిజన్ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటి?

ఈ గోల్డెన్ హారిజన్ మిస్సైల్ 1500 నుండి 2000 కిలోమీటర్ల రేంజ్‌లో సేవలు అందిస్తుంది. దీనిని భారత వైమానిక దళానికి చెందిన Su-30MKI యుద్ధ విమానాలపై మోహరించవచ్చు. సుఖోయ్‌తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలపై కూడా దీనిని ఏర్పాటు చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఈ క్షిపణి సూపర్‌సోనిక్ వేగంతో ప్రయోగించవచ్చు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా క్షణాల్లో లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసం చేస్తుంది. ఇందులో అణు వార్‌హెడ్‌లను కూడా అమర్చవచ్చని, దాంతో ఈ మిస్సైల్ మరింత ప్రమాదకరంగా మారుస్తుందని చెబుతారు.

ఇక్కడ బటన్ నొక్కితే, అక్కడ ఇస్లామాబాద్ బూడిద

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పలు నగరాల్లో దాడులు చేసి పాక్ సైన్యానికి కూడా గట్టిగా బుద్ధి చెప్పింది. ఒకవేళ భారత్ కనుక ఇజ్రాయెల్ నుంచి ఈ పవర్‌ఫుల్ మిస్సైల్ పొందిన తర్వాత పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం కనుక వస్తే, ఇండియన్ ఆర్మీకి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ మిస్సైల్ ప్రయోగిస్తే క్షణాల్లో ఇస్లామాబాద్, కరాచీ వరకు చేరుకుని టార్గెట్స్‌ను నామరూపాలు లేకుండా చేసే సత్తా దీని సొంతం.