Gold Locker Rules: బ్యాంకు లాకర్లో ఎంత బంగారం దాచుకోవచ్చు, దానికి నియమాలు ఏంటి?

1 month ago 2
ARTICLE AD

Gold Locker Conditions: చాలా మంది తమ బంగారం, ఇతర విలువైన ఆభరణాలను సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ లాకర్లలో ఉంచుకుంటారు. లాకర్లలో ఆభరణాలు ఉంచడం మంచి నిర్ణయమని చెప్పవచ్చు. దీనివల్ల ఇంట్లో దొంగతనం భయం ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తీసుకోవచ్చు. బ్యాంక్ దీనికి కొంత ఛార్జీ వసూలు చేస్తుంది. మీ ఆభరణాల భద్రతను నిర్ధారిస్తుంది. బ్యాంకు లాకర్లలో ఆభరణాలు ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి మీరు తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?

ఆదాయపు పన్ను చట్టం (Income Tax) ప్రకారం, ఒక వివాహం అయిన మహిళ 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అవివాహిత మహిళలకు ఈ పరిమితి 250 గ్రాములు ఉంటుంది. దీనితో పాటు పురుషులు తమ పేరు మీద 100 గ్రాముల వరకు బంగారం ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి పరిమితి అందరికీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వివాహిత, పురుషుడు, మహిళ ఒకే ఇంట్లో నివసిస్తుంటే, వారి వద్ద మొత్తం 100 గ్రాములు + 500 గ్రాములు = 600 గ్రాముల బంగారం ఉండవచ్చు. ఒకవేళ అవివాహిత, పురుషుడు ఇంట్లో ఉంటే రూల్స్ ప్రకారం వారి వద్ద మొత్తం350 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు.

లాకర్లలో బంగారం ఉంచడానికి పరిమితి

RBI ప్రకారం బ్యాంక్ లాకర్లలో బంగారం ఉంచడానికి గరిష్ట పరిమితులు లేవు. కానీ తమ లాకర్లలో ఎంత బంగారం ఉంచుతున్నారు అనేది బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు మీరు చట్టబద్ధంగా బంగారం కొనుగోలు చేశారని అందుకు ప్రూఫ్స్ మీ వద్ద ఉండాలి. ఇంకా చెప్పాలంటే, బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారం ఉంచాలనే దానిపై RBI ఎలాంటి రూల్స్, కండీషన్లు పెట్టలేదు. ఒక కస్టమర్ తన బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారం ఉంచుకోవాలనుకుంటున్నారో అది వారి ఇష్టం. మీరు అందులో ఏదైనా చట్టవిరుద్ధమైనది ఉంచకపోతే, మీ లాకర్లలో మీరు ఏమి ఉంచారు, ఎందుకు ఉంచారు అని బ్యాంక్ మిమ్మల్ని ప్రశ్నించదు.

లాకర్ కోసం ప్రాధాన్యతా జాబితా

దీపావళి తర్వాత బ్యాంకింగ్ నిబంధనలలో చేసిన మార్పుల ప్రకారం, ఇప్పుడు లాకర్ తెరిచే వ్యక్తి ప్రాధాన్యతా జాబితాను సమర్పించాలి. అంటే, లాకర్ తెరిచేటప్పుడు, అతని మరణం తర్వాత లాకర్ తెరిచే హక్కుదారుడు ఎవరో బ్యాంకుకు రాతపూర్వకంగా ఇవ్వాలి.

బ్యాంకర్ లాకర్ భద్రతను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో ఏదైనా చట్టపరమైన వివాదాలను నివారించడం దీని లక్ష్యం. ఇంతకుముందు లాకర్ హోల్డర్ మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య లాకర్ గురించి గొడవలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రాధాన్యతా జాబితా ఉండటంతో గొడవలు జరిగే అవకాశం లేదు. ఆ జాబితా ప్రకారం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి లాకర్ తెరిచే హక్కుదారుడు అవుతాడు. ఆ వ్యక్తి లేకపోతే, రెండవ వ్యక్తి .. ఇలాగే రెండవ వ్యక్తి మూడో వ్యక్తి.. మూడో వ్యక్తి లేనిపక్షంలో నాల్గవ స్థానంలో ఉన్నవారు లాకర్ తెరిచే హక్కు కలిగి ఉంటారు.

Read Entire Article