Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు (అక్టోబరు 24న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శోభనం రోజు ఎవరు నిద్రపోతారు..

జాను తనకి సంజయ్‌కి శోభనం అయినట్లు ఊహించుకుంటుంది. తర్వాత గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టి సిగ్గు పడుతుంది.. ఏంటి సిగ్గు పడుతున్నావ్ అని సంజయ్ అడుగుతాడు. తర్వాత పాలు ఇస్తుంది. సంజయ్ మొత్తం తాగేస్తే ఏంటి మొత్తం తాగేశావ్ అంటే మరేంటి సగం ఇవ్వాలా అని సంజయ్ అంటాడు. ఇక జాను తనకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటే నీ ప్లేస్‌లో ఎవరు ఉన్నా అలాగే చేస్తా.. అమ్మమ్మ తాతయ్య బాధ పడతారు అనే అలా భుజం మీద చేయి వేసి అలా చెప్పా అని అంటాడు. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అయింది.. ఇది కదా ఒక భర్త చేయాల్సింది అని అనిపించింది.. మీలో కోపాన్ని మాత్రమే ఇన్ని రోజులు చూశా కానీ మీకు మంచి మనసు ఉంది.. మీలాంటి వాళ్ల దగ్గర ఏ ఆడపిల్ల అయినా సంతోషంగా ఉంటుందని అంటుంది. ఏంటి నీకు నిద్ర రావడం లేదా అని సంజయ్ అంటే శోభనం రోజు ఎవరు నిద్రపోతారు అని అంటుంది. ఇక జాను సంజయ్‌తో మీరు ఎవరినైనా ప్రేమించారా అని అంటుంది. లైట్ ఆపేసి పడుకో అని సంజయ్ అంటాడు. జాను ఇంకా మాట్లాడుతుంటే నీకో దండం నాకు నిద్రోస్తుంది అని పడుకుంటాడు. జాను సంజయ్‌ని చూసి మురిసిపోతూ ఏదైనా థ్యాంక్స్ అని సిగ్గు పడుతుంది. చూస్తే జాను సంజయ్‌ని ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది.

మా అక్క బావ ఇల్లే కదా..

కిన్నెర సంజయ్ ఇంటి దగ్గర పువ్వులు కోస్తూ చెప్పకుండా కోస్తే ఏమైనా తప్పా.. అయినా ఇది మా అక్కబావల ఇల్లే కదా.. ఏం కాదులే.. అయినా బావ ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. ఒకసారి ప్రేమగా మాట్లాడుతాడు. మరోసారి కోపంగా ఉంటాడు. ఈ కొత్త బావ ఈ సారి కనిపిస్తే క్లాస్ ఇవ్వాలి.. అంటూ సంజయ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సంజయ్ అక్కడికి వచ్చి కిన్నెర వెనకాలే నిల్చొని మొత్తం వింటుంటాడు. తర్వాత కిన్నెర వెనక్కి తిరిగి చూసి బా.. బా.. అంటుంది. ఏంటి నేను కోపంగా ఉంటానా.. నీతో సరిగా మాట్లాడనా.. మీ ఇంట్లో అందరికీ అతి తెలివి కదా.. అయినా మా ఇంటి పూలు ఎందుకు కోస్తున్నావ్ అని అంటే ఎక్కడైతే ఏంటి బావ.. దేవుడా దేవుడా.. మా అక్క బావ బాగుండాలి అని కోరుకుంటాలే అని అంటుంది. మిమల్ని బావ అనిపిలవొచ్చా అని కిన్నెర అడిగితే సరే మనం ఓ డీల్ పెట్టుకుందాం.. అందరి ముందు సార్ అని పిలువు.. ఎవరూ లేకపోతే బావ అని పిలువు అని అంటాడు. సరే బావ అని కిన్నెర సంజయ్‌కి ఓ మాట చెప్తా అని దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకొని పారిపోతుంది. దాంతో సంజయ్ నవ్వుకుంటాడు.

జానుకి లెక్కలు అడగండి..

శారద, మురళీ కూర్చొని ఉంటే గౌతమి వచ్చి అమ్మ ఫీజు కట్టలేదు.. డబ్బు ఏర్పాటు చేయండి అని అడుగుతుంది. ఇంట్లో సరుకులకే డబ్బులు లేవు ఇక ఫీజు కట్టడానికి ఎక్కడ ఉన్నాయి. ఇంట్లో పరిస్థితి తెలిసి కూడా ఫీజు అంటావేంటి అని శారద అంటుంది. మరి నా చదువు పరిస్థితి ఏంటి అని గౌతమి అంటే గౌతమి కొంచెం ఓపిక పట్టు నేను ఏదో ఒకటి చేస్తా అని అంటాడు. ఏం చేస్తావ్ బావ ఎలా కడతావ్.. మళ్లీ కొత్త అప్పులు చేస్తావా.. ఏం అవసరం లేదు అని నందు అంటుంది. అలా అంటావేంటి అక్క అని గౌతమి అంటే అయితే మీ చిన్నక్కని అడుగు.. సింహాద్రి ఇచ్చిన డబ్బులు ఆపరేషన్‌కి అయిపోగా మిగతావి ఏమైపోయావి.. ఆ లెక్కలు చెప్పిందా.. అమ్మ లెక్కలు అడుగు అని నందు శారదకి చెప్తుంది. నేను ఎలా అడుగుతానే అని శారద అంటే మరి వెళ్లి తేరగా తిన్నావ్ కదా అని నందు అంటుంది. అక్కా నా ఫీజ్ గురించి తేల్చమంటే చిన్నక్క ఫంక్షన్ గురించి ఎందుకు అని గౌతమి అంటే వెళ్లి దాన్ని లెక్కలు అడుగు అని నందు అంటుంది.

ఇంత బరువున్నావేంటి..

సంజయ్ పేపర్ చదువుతూ ఉంటే జాను పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రకటనలు చూసి ఇంటర్వ్యూలకు వెళ్లి జాబ్ సంపాదించి.. జీతం అడ్వాన్స్ అడిగి గౌతమి ఫీజు కట్టేయాలి అనుకుంటుంది. సంజయ్ వెనకాలే నిల్చొని పేపర్ చూస్తుంది. సంజయ్ చూసి అలా చూస్తావేంటి టైం సేప్ చేయడానికి అని అంటుంది. మళ్లీ మళ్లీ సంజయ్ వెనకాలే వెళ్లి ప్రకటనలు చూస్తుంది. తొంగి చూస్తూ చూస్తూ సంజయ్ ఒడిలో పడిపోతుంది. సంజయ్ జానుని లేపి చూస్తే సన్నగా ఉన్నావ్ ఇంత బరువు ఉన్నావేంటి అని అంటే భార్య బరువు మోయాలి కదా అని జాను అంటుంది. ఇక సంజయ్ పేపర్ జాను చేతిలో పెట్టేసి చదువుకో అని అంటాడు. జాను ఎలా అయినా ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలి అనుకుంటుంది.

జానుని తిట్టిన నందు..

కిన్నెర ఏడుస్తూ జాను దగ్గరకు వెళ్లి ఇంట్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నందు, గౌతమి అక్కలు ఇద్దరూ నువ్వు ఫీజు డబ్బులు ఇవ్వలేదు అని తిడుతున్నారు అని అంటుంది. ఏదో చిరాకులో అలా అంటున్నారులేరా.. ఆ ఫీజు నేనే ఏదో కొటి చేసి కడతా అని అంటే నందు వచ్చి సూపర్ జాను అయినా ఎలా కడతావ్.. నిన్ను మేం నమ్ముతాం అనుకున్నావా.. అని నందు అంటుంది. నేను ఏదో ఒకటి చేసి కడతా అన్నాను కదా అని జాను అంటే వద్దమ్మా వద్దు నీ సాయం అవసరం లేదు.. ఆదుకుంటా అని చెప్తావ్ తర్వాత ముఖం ధీనంగా పెడతావ్ అని దండం పెట్టి వెళ్లిపోతుంది. జాను కన్నీరు పెట్టుకుంటే సంజయ్ వచ్చి ఏమైందని అడిగితే కళ్లతో నలక పడిందని అంటుంది. మీ అక్క మాటలు విన్నాలే.. మీ అక్కే నిన్ను మహానటి అంటే నేను ఏం అనాలో అని అంటుంది. నాదో వింత పరిస్థితి అంటూ జాను బాధ పడుతుంది. తర్వాత సంజయ్‌ని ఓ చోట డ్రాప్ చేయమని ఇంటర్వ్యూకి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.