Godavari Serial Today Episode | ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 17న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తినిపించనా బావ..

మురళీ తినడానికి ఇబ్బంది పడితే అందరూ నందుకి తినిపించమని అంటారు. తినిపించనా బావ అని నందు అడిగితే వద్దులే నందు నీకు ఇబ్బంది అని మురళీ అనేస్తాడు. వాడు అలాగే అంటాడు.. కానీ బాధ పడుతున్నాడు తినిపించు నందు అని బామ్మ చెప్పడంతో నందు మురళీకి తినిపిస్తుంది. మురళీ నందుకి థ్యాంక్స్ చెప్తే.. ఎందుకు బావ మా కోసం అన్ని దెబ్బలు తిన్నావ్.. ఒక్క సారి కోసం మీ కోసం అది చేశా ఇది చేశా అనలేదు.. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని నందు అంటుంది. థ్యాంక్స్ సరిపోదు బావకి ట్రీట్ ఇవ్వాలి అని గౌతమి, జానులు అంటే బిర్యాని చేస్తా అని నందు అంటే వద్దు మురళీని బయటకు తీసుకెళ్లు అని బామ్మ అంటుంది. ఇద్దరం సాయంత్రం బయటకు వెళ్లి ఐస్‌క్రీం తిందాం అని నందు అంటుంది. సాయంత్రం సిటీకి వెళ్లాలి నందు నువ్వు వస్తావా అని మురళీ అడిగితే సరే అని నందు అంటుంది.

Also Read : Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నువ్వు సింహాద్రి కొడుకురా.. సింహానివి..

సింహాద్రి కొడుకుని తీసుకొని వస్తాడు. నిత్య తమ్ముడికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. కల్యాణ్ నువ్వు సింహాద్రి కొడుకువిరా.. సింహం లాగా బ్రతకాలి అర్థమైందా? చాలా మంది డబ్బున్న కుటుంబంలో దద్దమ్మల్లా పుడతారు.. ఆ డబ్బుని హోదాని ఎంజాయ్ చేయలేరు. మానవత్వం, సమానత్వం అంటూ ఏవేవో కబుర్లు చెప్తా ఉంటారు. మనం అలా ఉండకూడదు కల్యాణ్.. నువ్వు నాన్న ఆస్తికి ఈ కుటుంబానికి వారసుడివి. మనుషుల్ని సిచువేషన్స్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి అని చెప్తుంది నిత్య. నిత్య మాటలు విని అరుణ మనసులో ఇది వాళ్ల నాన్న కన్నా ప్రమాదకరంగా తయారైంది అని అనుకుంటుంది. కూతురి మాటలకు సింహాద్రి చాలా బాగా చెప్పావమ్మా అని అంటాడు.

తమ్ముడికి చితక్కొట్టేసిన నిత్య..

నిత్య చెప్పిన వాటికి కల్యాణ్ సరే అని తలూపితే నిత్య లాగి పెట్టి కొడుతుంది. అక్కా అని కల్యాణ్ అంటే నోర్ముయ్ ఒకమ్మాయిని అదే గౌతమిని తోట కాగితాలు ఇస్తా అని చెప్పి గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్తావా.. అని అంటుంది. తనే వచ్చింది తనే పార్టీ అడిగింది అని కల్యాణ్ అంటే మళ్లీ ఒక్కటిచ్చి అబద్ధాలు చెప్పకు.. ఏం చేస్తున్నావ్‌రా., కాలేజ్‌కి వెళ్లే నువ్వు అమ్మాయిలకు గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లడం బీర్లు బిర్యానిలు ఏం చేస్తున్నావ్.. ఏం అవుతున్నావ్‌రా.. సరిగా ప్లాన్ చేసుకోవాలి కదరా.. చేతికి మట్టి అంటకుండా పని చేయాలి అది తెలివైన వాడి మొదటి లక్షణం అని ఒక్క సారి షాక్ ఇస్తుంది. బావకి నాకు పెళ్లి కాబోతుంది అది అయ్యే వరకు తొందర పడకు.. భువన అత్త దృష్టిలో మనం చెడు అవ్వకూడదు.. నా మెడలో మూడు ముళ్ల పడ్డాక ఆ జాను కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టి ఊరి పొలిమేర దాటేలా చేద్దాం అని అంటుంది. నా కూతురు అనిపించుకున్నావ్ నిత్య అని సింహాద్రి మురిసిపోతాడు. ఇక నిశ్చితార్థం ఏర్పాట్లు చేద్దాం అని సింహాద్రి కొడుకుని తీసుకొని వెళ్తాడు.

Also Read : Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ

మీకు ఆ విషయం తెలీదు..

జాను సూర్య ఇచ్చిన చీర కట్టుకొని సూర్య ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. నందు జానుని చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే జాను గుడికి అని అబద్ధం చెప్తుంది. సూర్య కూడా జాను వస్తుంది అని చాలా సంతోషంగా ఉంటాడు. తుఫాను సూర్యని చూసి మనసులో మీ అమ్మగారు మీకు నిత్యకి నిశ్చితార్థం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు మీకు తెలీదు కదా అని అనుకుంటాడు. సూర్య తుఫానుతో జాను వస్తుంది అమ్మతో మాట్లాడుతుంది మా పెళ్లి అయిపోతుంది.. అని చాలా సంతోషంగా చెప్తాడు. ఇక జాను సూర్య ఇచ్చిన చీర కట్టుకొని ఫొటోలు తీసుకొని సూర్యకి పంపిస్తుంది. సూర్య చూసి మురిసిపోతాడు. చాలా బాగుందని చెప్పడంతో జాను హ్యాపీ అయిపోతుంది. నందు కాఫీ ఇచ్చి చీర ఎక్కడిదే ఎప్పుడూ చూడలేదు అని అడుగుతుంది. జాను కవర్ చేస్తుంది. మనసులో సూర్య వాళ్ల అమ్మని ఒప్పించి అక్కకి విషయం చెప్తా అనుకుంటుంది.

మీ అమ్మ కల్యాణ్‌ని విడిపించింది..

ఎస్‌ఐ జానుకి ఫోన్ చేసి మీరు కేసులు పెడతారు మీ అమ్మ వచ్చి సింహాద్రి కొడుకు మీద కేసు వద్దు అని రాసి ఇచ్చి కల్యాణ్‌ని విడిపించుకొని తీసుకెళ్లింది.. ఏంటమ్మా ఇది అని అంటాడు. జాను, నందు షాక్ అవుతారు. శారద ఇంటికి రాగానే ఇద్దరూ శారదని నిలదీస్తారు. ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.. గౌతమిని పాడు చేయాలని తీసుకెళ్లారు. మురళీని అరెస్ట్ చేశారు.. రేపు ఇంకేదో చేయరు అని గ్యారెంటీ ఏంటి.. మీది వయసులో ఉన్న ఆవేశం.. నాది శాంతి.. మన డబ్బు హోదా ఉన్న నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నాం.. మన వైపు న్యాయం ఉంటే,, వాళ్ల వైపు డబ్బు ఉంది.. ఇది ఒక్కదానితో ఆగదే అని శారద ఏడుస్తుంది. అందరికీ దండం పెట్టి గొడవలు ఇక వదిలేద్దాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.