Godavari Serial Today Episode ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 14న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది.. ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మా అక్క అయితే వేరేలా ఉండేది..

జాను వాళ్ల ఇంటికి సింహాద్రి రావడంతో జాను, సింహాద్రి ఢీ అంటే ఢీ అనుకుంటారు. జానూ చివరి సారిగా చెప్తున్నా. నాతో గొడవ వద్దు తట్టుకోలేరు అని సింహాద్రి అంటాడు. దానికి జాను నవ్వుతూ నీ కొడుకు తప్పు చేశాడు.. నేను అరెస్ట్ చేయించాను. నువ్వేమో మా ఇంటి ముందుకి వచ్చి అది చేస్తాను.. ఇది చేస్తాను అని గొంతు చించుకుంటున్నావ్. నీ కొడుకు పెద్ద తప్పు చేశాడు చాలా పెద్ద నేరం చేశాడు గట్టిగా శిక్ష పడుతుంది. ఈ విషయం నీకు తెలిసి భయపడుతున్నావు అందుకే మా ఇంటికి బేరానికి వచ్చావు లేనిపోని మేకపోతు గాంభీర్యం చూపించకు.. అని జాను అంటుంది. దానికి సింహాద్రి అమ్మా చెల్లమ్మా.. జాను నన్ను క్షమించండి నా కొడుకుని కాపాడండి అంటూ కాళ్లపై పడతాను అనుకున్నారా.. సింహాద్రి ఇక్కడ నేనేంటో చూపిస్తా అని అంటాడు. అహంకారం అడ్డొస్తుంది కదా అందుకే గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నావ్. నేను కాబట్టి గేటు దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నాను. అదే మా నందు అక్క వచ్చిందనుకో నీ మెడ పట్టి బయటికి నెట్టి మరి మాట్లాడుద్ది అయినా నీతో మాట్లాడడం అనవసరం. నీకు చేతనైంది చేసుకో వెళ్లు అని జాను సింహాద్రిని పంపేస్తుంది. శారద భయం వేస్తుందని అనడంతో ఏం కాదు అంతా నేను చూసుకుంటా అని జాను అంటుంది.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
రగిలిపోయిన నిత్య..

సూర్య జాను కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఊరు వచ్చిన నిత్య సూర్యని చూసి బావ నాకోసమే వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా అని దగ్గరకు వెళ్తుంది. ఇంతలో జాను సూర్య దగ్గరకు రావడం చూసి షాక్ అయి ఆగిపోతుంది. సూర్య జానుకి వెల్ కమ్ చెప్పి చీర గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు అని జాను అంటే ఈ పడవబ్బాయ్‌కి గోదారి అమ్మాయి మీద ప్రేమ పొంగిపోతుంది అందుకే అని అంటాడు. సూర్య మన ప్రేమ సక్సెస్ అవ్వాలి అంటే మీ అమ్మ ఒప్పుకోవాలి అని జాను అంటే నేను ఒప్పిస్తా అని సూర్య అంటాడు. నిత్య ఈ సీన్ చూసి రగిలిపోయి సూర్య జానుకి చీర గిప్ట్ ఇస్తుంటే జాను తీసుకునే టైంకి కారులో స్పీడ్‌గా వచ్చేస్తుంది. సూర్య జాను ఇద్దరూ చెరో వైపు తప్పుకుంటారు. దాంతో సూర్య చేతిలో ఉన్న చీర కింద పడిపోతుంది.

నేనే బావ నీ నిత్యనే..

సూర్య కోపంగా వెళ్లి ఏయ్ కళ్లు కనిపించడం లేదా అని అంటే నిత్య బయటకు వచ్చి లేదు బావ నా చూపు అంతా నీ వైపే ఉంది అని నిత్య అనడంతో సూర్య నిత్యని గుర్తు పడతాడు. నిత్య నువ్వేనా అని అంటాడు. ఇక నిత్య కింద పడిన చీర కాలితో తొక్క బోతే జాను ఏయ్ అంటూ ఆపుతుంది. కాలు తీయమని చెప్పి చీర పైకి తీసి మర్యాద లేదా అని అంటే నా దగ్గర డబ్బు ఉంది కొనేస్తా అని నిత్య అంటుంది. దానికి జాను సింహాద్రి కూతురివి కదా.. మర్యాద ఏం తెలుస్తుంది అని అంటుంది. ఇద్దరూ గొడవ పడుతుంటే సూర్య ఆపుతాడు. నిత్య జానుతో మా బావ జోలికి రాకు నేను మా నాన్నకంటే డేంజర్ అని నిత్య అంటుంది. జాను అవేమీ పట్టించుకోకుండా సూర్య నేను వెళ్తున్నా.. ఇచ్చిన మాట గురించి ఆలోచించు అని అంటుంది. జాను వెళ్తుంటే నిత్య ఆపి నేను పేరు నిత్య గుర్తు పెట్టుకో అని అంటుంది.

మీ అత్తని పిలుస్తానే..

శారద మురళీ కోసం కాపడం పెట్టడానికి వేడి నీరు తీసుకెళ్తుంటే బామ్మ ఆపి వేడి నీరు ఇస్తావు కాపడం ఎవరు పెడతారు అని అడుగుతుంది. ఎవరు పెడతారు అత్తయ్య తనకి తానే పెట్టుకోవాలి అని శారద అంటే నీ మొగుడికి ఏమైనా అయితే నువ్వే పెడతావ్ కదే మరి మురళీకి ఎవరు పెట్టాలి.. అని నందుని పిలిచి నువ్వు అసలు మాట మీద నిలబడుతున్నావానే.. మీ అత్తా వాడిని తీసుకెళ్లిపోతా అంటే ఆపావు.. నేను చూసుకుంటా అన్నావ్ ఇప్పుడు ఏం చూసుకుంటున్నావే.. నీ మొగుడు దెబ్బలు తగించుకుంటే మీ అమ్మ నీరు తీసుకెళ్తుంది. నువ్వు వెళ్తావా లేదంటే మీ అత్తని పిలిచి నీ కొడుకుని తీసుకెళ్లిపో అని చెప్పాలా అని బామ్మ అడుగుతుంది. దాంతో నందు నేనే తీసుకెళ్తా అని వేడి నీరు తీసుకెళ్తుంది.

ALSO READ: Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!

మురళీకి కాపడం పెట్టిన నందు..

మురళీ ఒళ్లంతా నొప్పులు అయిపోయి చాలా బాధ పడుతుంటాడు. ఇంతలో నందు వెళ్తే ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఇవ్వమని అంటుంది. దానికి నందు వద్దు బావ కాపడం పెడతాను అని అంటుంది. ఇంత అదృష్టమా అని మురళీ మనసులో అనుకుంటాడు. నువ్వు ఇలా కాపడం పెడతావా అని తెలిస్తే ఇంకా నాలుగు దెబ్బలు ఎక్కువ తగిలించుకునే దాన్ని నందు అని మురళీ అనగానే అవునా అని నందు గొట్టిగా కాపడం పెడుతుంది. దాంతో మురళీ కెవ్వుమంటాడు. తర్వాత మురళీ చేయి నొప్పిగా ఉందని మసాజ్ చేస్తావా అని నందుని అడుగుతాడు. నందు సరే అంటుంది. మురళీ అలా చూస్తూ ఉండిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర సీన్స్‌తో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.