Skin Care Tips for Radiant Skin : ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలుష్యంలో తిరగడం.. మేకప్ ఎక్కువసేపు ఉంచుకోవడం.. లైఫ్స్టైల్లో మార్పులు.. వివిధ కారణాల వల్ల స్కిన్ మారిపోతుంది. ఎండలు, వర్షాలు, వాతావరణంలోని మార్పులు చర్మాన్ని మార్చేస్తాయి. స్కిన్ని డల్గా చేస్తాయి. చర్మం అలసిపోయి లుక్ మారిపోతుంది. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దీనికోసం చికిత్సలు అవసరం లేదని.. కొన్ని బేసిక్ రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలని అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు డాక్టర్ గీతాంజలి శెట్టి. మెరిసిపోయే స్కిన్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ కొన్ని సూచించారు.

మైల్డ్ క్లెన్సర్..

చర్మ సంరక్షణకు మైల్డ్గా ఉండే క్లెన్సర్ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి హెల్ప్ అవుతుంది. మేకప్, అదనపు నూనెను తొలగించేందుకు ఇది హెల్ప్ అవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలను కూడా ఇది దూరం చేస్తుంది. కాబట్టి మృదువైన ఫేస్ వాష్‌ని ఎంచుకోవాలని చెప్తున్నారు. హైడ్రేషన్ కోసం చర్మాన్ని ఇది సిద్ధం చేస్తుంది. ఇది చర్మం డల్నెస్ నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. డబుల్ క్లెన్స్ చేస్తే స్కిన్ మరింత హెల్తీగా ఉంటుంది.

హైడ్రేషన్ కీలకం

చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ చర్మాన్ని మృదువుగా, బిగుతుగా చేస్తుంది. కాబట్టి హైడ్రేటింగ్ పదార్థాలతో నిండిన ఫుడ్స్ తీసుకోవడం, నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు పుష్కలంగా తీసుకోవడం వల్ల చర్మంలోని టాక్సిన్లు బయటకిపోతాయి. ఇది చర్మం లోపలి నుంచి పోషణను ఇవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే హైడ్రేషన్ కోసం మంచి మాయిశ్చరైజర్‌ ఎంచుకుంటే మంచిది. క్లెన్స్ తర్వాత స్కిన్ కాస్త డ్రైగా మారుతుంది కాబట్టి దానిని దూరం చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది.

సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు

ఈవెంట్స్ తర్వాత లేదా సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే దానిని రక్షించడం చాలా ముఖ్యం. ఇలా కాపాడుకోవాలంటే రెగ్యులర్గా సన్‌స్క్రీన్ వాడుకోవడం చాలా ముఖ్యం. ఇది పిగ్మెంటేషన్ దూరం చేయడంతో పాటు.. వృద్ధాప్య ఛాయాలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది స్కిన్ మెరిసేందుకు కూడా హెల్ప్ చేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా, యవ్వనంగా, తాజాగా ఉండడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఈ మూడు సింపుల్ టెస్ట్లు రెగ్యూలర్గా ఫాలో అయితే చర్మం శుభ్రపడడంతో పాటు మంచిగా హైడ్రేట్ అవుతుందని తెలిపారు గీతాంజలి. అలాగే స్వీయ సంరక్షణ తీసుకుంటేే స్కిన్ మెరుస్తూ ఉంటుందని.. దీనికోసం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదంటూ సూచనలిచ్చారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.