Germany rolls out the welcome mat For Indian talent: అమెరికాలో హెచ్-1బి వీసా ఫీజులు భారీగా పెంచిన తర్వాత భారతీయ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఇతర దేశాలు పోటీ పడుతున్నాయి. చైనా ఇప్పటికే కే వీసాను ప్రకటించగా జర్మనీ కూడా భారతీయులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధఅమయింది. జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మన్ భారతీయ ఐటీ, మేనేజ్‌మెంట్, సైన్స్, టెక్ రంగాల్లోని నైపుణ్యవంతులైన ప్రొఫెషనల్స్‌కు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, తమ దేశ ఇమ్మిగ్రేషన్ విధానం "నమ్మకమైనది, ఆధునికమైనది, ముందుపట్టి చెప్పగలది" అని ప్రకటించారు. ఈ ప్రకటన అమెరికా కొత్త వీసా నిబంధనల వల్ల భారతీయ టెక్ ప్రతిభల్లో ఏర్పడిన అనిశ్చితిని ఉపయోగించుకుని, జర్మనీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా అప్లికేషన్ ఫీజు 1,00,000 డాలర్లు (సుమారు రూ. 88 లక్షలు) చేశారు. ఈ మార్పు అమెరికన్ కంపెనీలకు విదేశీ ఉద్యోగులను ముఖ్యంగా భారతీయులను నియమించుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అమెరికా ప్రజలకు ఉద్యోగాలు కల్పించడానికి అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, భారతీయ ఐటీ కంపెనీలు, ఔట్‌సోర్సింగ్ ఫర్మ్‌లు ఈ మార్పును తట్టుకోవడం కష్టం అనుకుంటున్నాయి. హెచ్-1బి వీసాల్లో 70 శాతం పైగా భారతీయులే లబ్ధిదారులు కాబట్టి అమెరికాకు వెళ్లే భారత టాలెంట్ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

అందుకే జర్మనీ ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. "భారతీయ ప్రతిభలు జర్మనీలో స్వాగతించబడతారు. మా ఇమ్మిగ్రేషన్ విధానం జర్మన్ కార్ల మాదిరిగా – ఆచ్చరికలు లేకుండా, మార్పులు లేకుండా నమ్మదగినది" అని జర్మన్ రాయబారి పిలుపునిచ్చారు. జర్మనీలో భారతీయులు సగటు జర్మన్ జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నారనిచచెబుతున్నారు. జర్మనీ ప్రభుత్వం 2025లో 2,00,000 ప్రొఫెషనల్ వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకుంది. వీటిలో 90,000 భారతీయులకు కేటాయించారు. గతంలో ఇది 20,000 వేలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం జర్మనీలో సుమారు 1,30,000 మంది భారతీయ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. ఈ వీసా విధానం ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ రంగాల్లో నైపుణ్యాలు కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Here is my call to all highly skilled Indians.

Germany stands out with its stable migration policies, and with great job opportunities for Indians in IT, management, science and tech.

Find your way to Germany to boost your career: https://t.co/u5CmmrHtoF pic.twitter.com/HYiwX2iwME

— Dr Philipp Ackermann (@AmbAckermann) September 23, 2025

జర్మనీ జనాభా వృద్ధి లేకపోవడం, వృద్ధాప్యం పెరగడం వల్ల 2040 వరకు ప్రతి సంవత్సరం 2,88,000 మంది ఇమ్మిగ్రెంట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అవసరాన్ని తీర్చడానికి, బెర్లిన్ 2024లో 10 శాతం పైగా ఎక్కువ ప్రొఫెషనల్ వీసాలు జారీ చేసింది. ట్రంప్ నిర్ణయాల వల్ల గ్లోబల్ టాలెంట్ వార్‌ను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ ఐటీ రంగం, ఔట్‌సోర్సింగ్ కంపెనీలు జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూస్తాయని అంచనా.