Garuda Purana: మరణం తర్వాత దహన సంస్కారాలు ఆలస్యం చేస్తున్నారా? ఎవరో వస్తారని ఎదురు చూడొచ్చా అసలు?

1 month ago 3
ARTICLE AD

గరుడ పురాణంలో శ్లోకం

యావన్న దహ్యతే దేహస్తావన్ముక్తిర్న విద్యతే |
ప్రేతత్వేనైవ తిష్ఠేద్ధి యావత్పిండం న దీయతే ||

మరణించిన వ్యక్తి శరీరం పూర్తిగా దహనం అయ్యేవరకూ ఆత్మ స్వేచ్ఛగా వెళ్లలేదు, జీవుడికి విముక్తి లభించదు. అది ప్రేతరూపంలో తిరుగుతుంటుంది. ఆకలి, దాహంతో బాధపడుతుంది. దహనం తర్వాత కూడా సంతానం లేదా బంధువులు పిండ ప్రదానం, తర్పణం , కర్మలు చేయకపోతే ఆ జీవి ప్రేత స్థితిలోనే ఉండిపోతాడు. ఇది అత్యంత దుఃఖకరమైన స్థితి. దహన సంస్కారాలు పూర్తైన తర్వాతే ఆ జీవి పితృలోక ప్రయాణానికి అర్హత సాధించినట్టు

గరుడ పురాణం ప్రకారం

దగ్ధే శరీరే తత్రైవ వాయు భూతస్తు గచ్ఛతి |
యావన్న దహ్యతే దేహస్తావన్ముక్తిర్న విద్యతే ||

శరీరం అగ్నిలో కలిసిపోయినప్పుడే ఆ జీవుడు వాయురూపంలో ముందుకు సాగేందుకు అనుమతి లభిస్తుంది. శరీరం కళ్ళముందు ఉన్నంత సేపూ ఆ జీవుడు తన బంధువులను పిలుస్తూ వారి మాటలు వింటూ తిరిగి తన దేహంలోకి వెళ్లాలని విలపిస్తాడు.

ధర్మశాస్త్రాల ప్రకారం మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి వీలైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతారు. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత జీవుడు ప్రేత రూపంలో ఉంటాడు. దహన సంస్కారం పూర్తయ్యే వరకు ఆ జీవుడికి లోకంతో ఉన్న బంధం పూర్తిగా తెగిపోదు. శరీరం ఎదురుగా ఉన్నంతసేపూ మమకారం పోదు..అందుకే పార్థివ దేహం ఉన్నంతవరకూ జీవి ఆ చుట్టుపక్కలే తిరుగుతుంటుంది. దహనం ఆలస్యం అయ్యే కొద్దీ ఆ జీవుడు పితృలోక ప్రయాణానికి ఆటంకాలు పెరుగుతుంటాయి.

ఎవరైనా మరణిస్తే..సూర్యాస్తమయం లోగా దహన సంస్కారాలు పూర్తిచేయాలి

సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే.. మరుసటి రోజు ఉదయం దహన సంస్కారాలు చేయాలి

సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహించకూడదు

పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరంలోంచి ప్రాణం పోగానే కుళ్లడం మొదలవుతుంది. ఆ పరిస్థితి లేకుండా కృత్రిమ పద్ధతుల్లో భౌతికకాయాన్ని ఉంచినా , ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ దేహం నుంచి ప్రతికూల శక్తి విడుదలను ఎవ్వరూ ఆపలేరు. పైగా మృతదేహం కళ్లముందు ఉన్నంతకాలం ఆ కుటుంబ సభ్యుల్లో శోకం, ఆవేదన పెరుగుతాయి. అందుకే ఎవరో వస్తారంటూ దహన సంస్కారాలు వాయిదా వేయడం సరికాదని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...జరగాల్సిన సమయంలో దహన సంస్కారాలు జరగకపోతే ఆలస్యం అయిన ప్రతి గంటా ఆ జీవుడికి శిక్షాకాలంతో సమానం. అంత్యక్రియలు పూర్తిచేసి ఆ తర్వాత నిర్వహించే దశ దిన కర్మలు, షోడశ కర్మల ద్వారా ఆ జీవుడికి పుణ్యలోకాలు కలగాలని ప్రార్థించాలి.

తలకొరివి పెట్టాల్సిన పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

తల్లిదండ్రులకు తనయుడు తలకొరివి పెట్టాలి కదా..ఆ కుమారుడే దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాలనే సందేహం వస్తుంది. అలాంటి తప్పని పరిస్థితుల్లోనూ కొన్ని మినహాయింపులున్నాయి.. అప్పుడు కూడా కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది..అంతకన్నా ఎక్కువ సమయం మృతదేహాన్ని ఉంచకూడదని పరాశర స్మృతిలో ఉంది

ఫ్రీజర్ బాక్సుల్లో మృతదేహాన్ని ఉంచడం వల్ల అది పాడవకుండా ఉంటుందేమో కానీ.. ఆధ్యాత్మికంగా ఆ జీవుడి ప్రేతస్థితి సమయం ఆగిపోదు. అది శిక్షగా మారుతుందని నారద స్మృతి లో ఉంది

భౌతిక దేహాన్ని భద్ర పరచడం అనేది ఆత్మను..భూలోకానికి - పరలోకానికి మధ్య త్రిశంకు స్వర్గంలా వదిలేసినట్టు. అందుతే కొడుకులు, కూతుర్లు, బంధువులు రావాలని దహన సంస్కారాలు ఆపేకన్నా జరపాల్సిన సమయంలో కార్యక్రమం నిర్వహించాలి. ఆ తర్వాత ఆత్మ శాంతి కోసం దాన ధర్మాలు చేసి..ముఖ్యమైన క్షేత్రాల్లో పిండప్రదానం చేయాలి

ప్రథమేహని యద్దత్తం తేన మూర్ధా ప్రజాయతే |
ద్వితీయే చక్షుషీ నాసా కర్ణా చైవ తృతీయకే

మరణించిన వ్యక్తి శరీరం దహనం అయిన తర్వాత ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఇందుకోసం సంతానం ఇచ్చే పిండాలు చాలా ముఖ్యం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Read Entire Article