గేమ్ చేంజర్ (Game Changer) విడుదల రోజునే నెట్టింట మంచి క్వాలిటీతో కూడిన హోచ్‌డి ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనక ఒక ముఠా పని చేసిందా? గూడుపుఠాణి జరిగిందా? అంటే... 'అవును' అనే సమాధానం వినపడుతోంది. ఒక పథకం ప్రకారం ముందు నుంచి ఒక ముట్ట గూడుపుఠానీ చేసిందని, కావాలని సినిమాపై విషం కక్కిందని చిత్ర బృందం పేర్కొంది. అంతే కాదు... సైబర్ క్రైమ్ పోలీసులకు 45 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..‌‌.

డబ్బులు డిమాండ్ చేసిన ముఠా...
పైరసీ చేస్తామని ముందే బెదిరింపులు!
'గేమ్ చేంజర్' విడుదలకు ముందు సినిమా నిర్మాతలైన దిల్ రాజు - శిరీష్ సహా చిత్ర బృందంలోని కొంత మంది కీలక అభ్యర్థులకు ఒక 45 మంది నుంచి బెదిరింపు ధోరణితో కూడిన సందేశాలు వచ్చాయట.‌ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వాట్సాప్ మెసేజ్‌లలో తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే 'గేమ్ చేంజర్'‌ సినిమాను లీక్ చేస్తామని చెప్పారని, అదే విధంగా పైరసీ చేశారని 'గేమ్ చేంజర్' యూనిట్ వర్గాలు తెలిపాయి.

'గేమ్ చేంజర్' విడుదలకు రెండు రోజుల ముందు ఆ సినిమాలో కీలక ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్‌లలో షేర్ చేసిన వ్యక్తులతో పాటు విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేసిన వాళ్లను యూనిట్ సభ్యలు గుర్తించారు. టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరికీ ఆ లింక్స్ షేర్ చేసిన వ్యక్తులను గుర్తించి వారి మీద సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్స్ చేశారు.

Also Read: నవ్వించే ప్రయత్నమే... మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు - అన్షుపై కామెంట్స్‌ & రేవంత్ రెడ్డి - బన్నీ ఇష్యూలో సారీ చెప్పిన త్రినాథరావు నక్కిన

'గేమ్ చేంజర్' యూనిట్ సభ్యులను బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన సుమారు 45 మందితో కూడిన ముఠా మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది సినిమా టీమ్. ఆ 45 మాత్రమే 'గేమ్ చేంజర్' మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం పైరసీ వెనుక ఎవరు ఉన్నారు? అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజానిజాలు అతి త్వరలో వెలుగులోకి వస్తాయని సమాచారం అందుతోంది.

పైరసీ ప్రింట్ లీక్ చేయడమే కాదు... సోషల్ మీడియా (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్, యూట్యూబ్) పేజీలలో 'గేమ్ చేంజర్' మీద ముందు నుంచి నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన కొంత మందిని సైతం యూనిట్ సభ్యులు గుర్తించారు. సినిమా క్లిప్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఇంకా కీలకమైన ట్విస్టులు రివీల్ చేసిన కొన్ని పేజీల మీద కూడా కంప్లైంట్స్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో ఆయా సోషల్ మీడియా పేజీల మీద కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారట.

Also Read: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?