Game Changer OTT Release Date: 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... రామ్ చరణ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా?
10 months ago 7
ARTICLE AD
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతుందనే సమాచారం వచ్చేసింది.
ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'...
విజనరీ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మూవీ రిలీజ్ కి ముందు నుంచే ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాబట్టి ఈ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది.
తాజా బజ్ ప్రకారం ఫిబ్రవరి 14న 'గేమ్ ఛేంజర్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. ఏదేమైనా మెగా అభిమానులు మాత్రం మూవీ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నిరాశపరిచిన 'గేమ్ ఛేంజర్'
'గేమ్ ఛేంజర్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 50 శాతం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బరువంతా రామ్ చరణ్ ఒక్కడే తన భుజాలపై మోసాడు అని చెప్పాలి. ఆయన కారణంగానే ఈ మాత్రం కలెక్షన్లైనా వచ్చాయి. వరుస డిజాస్టర్ల కారణంగా శంకర్ బ్రాండ్ వ్యాల్యూ 'గేమ్ ఛేంజర్' మూవీ విషయంలో ఏ మాత్రం ఉపయోగపడలేదు. మొదటి రోజే రూ. 186 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడానికి కారణం రామ్ చరణ్ చరిష్మా. అయితే ఆ తర్వాత 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలు ఒక్కో రోజు వ్యవధిలో రిలీజ్ కావడంతో, 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై గట్టి  దెబ్బ పడింది. ఫలితంగా పండగ సీజన్ అయినప్పటికీ 'గేమ్ ఛేంజర్' మూవీ పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
'ఆర్సీ 16' షూటింగ్ అప్డేట్
ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ని పక్కన పెట్టేసి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి 'ఆర్సీ 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న బుచ్చిబాబు - చరణ్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. తాజా షెడ్యూల్ ని జనవరి 27 నుంచి హైదరాబాద్ లోని ఒక ఐకానిక్ బూత్ బంగ్లాలో మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Bollywood Movies: ప్రభాస్ - ఇమాన్వీ to విక్కీ - రష్మిక వరకు... 2025లో సిల్వర్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసే ఫ్రెష్ జోడీలు
Read Entire Article