Ind Vs Aus Test Series: భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి గతంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. టెస్టుల్లో ఈ జనరేషన్లో గోట్‌గా ఖ్యాతి కెక్కిన సంగతి తెలిసిందే. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన భారత టెస్టు బౌలర్‌గా అశ్విన్ ఘనత వహించాడు. ఇందులో 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన, 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో దుమ్ము రేపాడు. అయితే అశ్విన్ కెరీర్ ఒక్కటి తక్కువైందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్లో మరింత బాగా వాడుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. 106 టెస్టులాడిన అశ్విన్.. 116 వన్డేలు, 65 టీ20లు మాత్రమే ఆడాడు. ఇదే విషయంపై గంభీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఆ ఒక్క విషయంలో అసంతృప్తి..
తనకు రవించంద్రన్ అశ్విన్ కెరీర్‌లో లిమిటెడ్ ఓవర్లలో ఎక్కువ చాన్సులు రాకపోవడంపైనే అసంతృప్తి ఉందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా తను ఎక్కువ వన్డేలు ఆడినట్లయితే, మరింత బాగుండేదని తెలిపాడు. అశ్విన్ కేవలం స్పెషలిస్టు స్పిన్నరే కాదని, సిసలైన బ్యాటింగ్ ఆల్ రౌండరని విశ్లేషించాడు. మరింతగా వన్డేల్లో అతనికి చాన్సులు వచ్చినట్లయితే అతను బాగా రాణించేవాడని అభిప్రాయ పడ్డాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసిన వ్యక్తి కేవలం వంద వన్డేలు మాత్రమే ఆడటం కరెక్టు కాదని వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై ఎవరిని నిందించాల్సిన పని లేదని పేర్కొన్నాడు.

Also Read: <a title="Aus Vs Ind Test Series: నాలుగో టెస్టుకు ఆసీస్ కొత్త అస్త్రం - 19 ఏళ్ల ఓపెనర్‌తో ప్రయోగం, మిగతా రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆసీస్" href="https://telugu.abplive.com/sports/cricket/the-australian-cricket-team-has-made-multiple-changes-in-its-squad-for-the-4th-and-the-5th-test-against-india-191201" target="_blank" rel="nofollow noopener">Aus Vs Ind Test Series: నాలుగో టెస్టుకు ఆసీస్ కొత్త అస్త్రం - 19 ఏళ్ల ఓపెనర్‌తో ప్రయోగం, మిగతా రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆసీస్

పరిస్థితులను బట్టే..
వివిధ ప్రత్యర్థులు, పరిస్థితులను బట్టే టీమ్ కూర్పు ఉంటుందని గంభీర్ గుర్తు చేశాడు. అశ్విన్‌కు ఎక్కువగా వన్డేల్లో ఛాన్సులు రాకపోవడంపై అప్పటి కెప్టెన్లను గానీ, కోచింగ్ సిబ్బందిని గానీ, సెలెక్టర్లను నిందించాల్సిన అసవరం లేదని, ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా కొన్నిసార్లు ఫింగర్ స్పిన్నర్ల కంటే రిస్ట్ స్పిన్నర్ల వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితులు నెలకొని ఉండవచ్చని, అందుకే అశ్విన్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదేమోనని విశ్లేషించాడు. నిజానికి పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకప్పుడు రెగ్యులర్ సభ్యుడైన అశ్విన్.. స్పిన్ ద్వయం కుల్చా పేరుతో ప్రసిద్ధమైన కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ రాకతో కాస్త ఇబ్బంది ఎదురైందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఫింగర్ స్పిన్నరైన అశ్విన్ కంటే కొన్నిసార్లు రిస్టు స్పిన్నర్లైన వీళ్ల వైపే పరిమిత ఓవర్ల క్రికెట్లో మొగ్గు చూపాల్సిన పరిస్థితి నెలకొందని, అందుకే అశ్విన్ ను ఈ ఫార్మాట్ల నుంచి పక్కన పెట్టాల్సి వచ్చిందని అభిప్రాయ పడుతున్నారు. 2010లో అరంగేట్రం చేసిన అశ్విన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మొత్తం 181 మ్యాచ్ లు ఆడాడు. అందులో 228 వికెట్లు తీశాడు.

Also Read: <a title="Kohli Shocking Desicion: విదేశాల్లో స్థిర పడనున్న కోహ్లీ - ఇప్పటికే రంగం సిద్ధం, ధ్రువీకరించిన కోహ్లీ చిన్ననాటి కోచ్" href="https://telugu.abplive.com/sports/cricket/indian-star-batter-virat-kohli-wants-to-settle-in-uk-191209" target="_blank" rel="nofollow noopener">Kohli Shocking Desicion: విదేశాల్లో స్థిర పడనున్న కోహ్లీ - ఇప్పటికే రంగం సిద్ధం, ధ్రువీకరించిన కోహ్లీ చిన్ననాటి కోచ్