Vishwak Sen's Funky Movie Trailer Reaction : డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేెటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'. 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

నవ్వులు పూయించిన ట్రైలర్

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనుదీప్, విశ్వక్ కాంబో 'ఫంకీ' ట్రైలర్‌ నవ్వులు పూయించింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్ ఓ యువకునితో చెప్పగా... 'నాకు రాదు డాక్టర్' అంటూ సీరియస్ మూమెంట్‌లోనూ సెటైరికల్ కామెడీతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. డైరెక్టర్ కావాలనుకునే హీరో... నిర్మాతగా హీరోయిన్... వీరిద్దరి మధ్య లవ్. ఇదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కిినట్లు తెలుస్తోంది. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో విశ్వక్ అదరగొట్టారు.

ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుపాన్ చూడబోతున్నామని కన్ఫర్మ్ అయ్యింది. విశ్వక్, కయాదు లోహర్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ట్రైలర్‌తో 'ఫంకీ'పై అంచనాలు రెట్టింపయ్యాయి.

Also Read : హీరోగా అనిల్ రావిపూడి... ప్రొడ్యూసర్‌గా అలీ అడ్వాన్... ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫన్