Vishwak Sen's FUNKY Movie Dheere Dheere Song Lyrics : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'. 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ మూవీ లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నవ్వులు పూయించగా తాజాగా 'ధీరే ధీరే' అంటూ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... స్వయంగా డైరెక్టర్ అనుదీపే లిరిక్స్ అందించారు. సంజిత్ హెగ్డే, రోహిణి పాడారు. లవర్స్ మధ్య బుజ్జగింపులు, అలకలు నేపథ్యంగా సాగే సాంగ్ అదిరిపోయింది. ఈ పాట లిరిక్స్ ఓసారి చూస్తే...

'ధీరే ధీరే' సాంగ్ లిరిక్స్

పల్లవి

ఉన్న మాట పైకి చెప్పనంటూ... లోపలేమో పైకి ఒప్పుకొంటూ...

నువ్వలా ప్రేమించవే

ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ముందరున్న నన్ను తప్పుకొంటూ...

సరేలే ఊరించవే...

గుప్పెడంత గుండెకెంత గుట్టు... ఎందుకంటే దానికంత బెట్టు...

నీకు నువ్వే చేయి చేయి పట్టేదాకా నే వేచి ఉంటానులే...

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ

చరణం 1

నిండుగా కళ్లల్లో నీదే కల... నిజమై నన్నదీ చేరేదెలా...

వేడిగా ఉన్నదే నీ వెన్నెలా... చల్లగా నన్నదీ తాకేదెలా...

లోకమంతా నన్నే చూసే ఎదురుచూపై మిగిలానే...

తలుచుకుంటూ నిన్నే నిన్నే ఓ.. ఓ.. ఓ... ఓ...

నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే

అంతకన్నా పనేం లేదులే.. ఈ ఆవారాకీ

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ...

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ...

చరణం 2

చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ... వేచిలాలిలాగా వెంట ఉంటూ...

మాయే చేశావులే...

ఎవ్వరేమి అన్న పట్టదంటూ... నమ్ముకున్న ప్రేమ గట్టిదంటూ...

నన్నే గెలిచావులే...

నువ్వు నేను ఇంక ఒక్కరంటూ... గుండెలోన చోటు రాసిపెట్టు...

రంగు మారి చెంగు చెంగు చెంగుమంటూ నీ జంటకొస్తానులే...

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ

ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లో ఆగయీ... మేరా దిల్లే లేగయీ

Also Read : శివాజీ Vs అనసూయ - రుణం తీర్చుకుంటానన్న 'మంగపతి'... మీలాంటి వాళ్ల సపోర్ట్ అసలే వద్దన్న 'రంగమ్మత్త'