Today OTT Movies Streaming Complete List : శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్‌కు పండుగే. థియేటర్లలో సూపర్ మూవీస్‌తో పాటు ఓటీటీల్లోనూ సూపర్ హిట్ మూవీస్ అందుబాటులోకి వస్తాయి. ప్రతీ వారంలానే ఈ వారం కూడా హిట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓసారి చూస్తే...

రావు బహదూర్ : సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur). ఈ మూవీకి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించగా... సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

బాలన్ ది బాయ్ : మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం సైకలాజికల్ డ్రామా బాలన్ ది బాయ్ (Balan The Boy). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

అబ్జెక్షన్ మై లార్డ్ : శ్రీకాంత్, ముఖేష్ రిషి ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్. ప్రముఖ ఓటీటీ ZEE5లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

దీవానా : హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రొమాంటిక్ డ్రామా దీవానా (Deewana). శ్రీకాంత్ వంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా... ప్రముఖ ఓటీటీ ఆహాలో (Aha) శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.

Also Read : Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?