This Week Friday OTT Releases Complete List : శుక్రవారం ఒకే రోజు 19 సినిమాలు అందుబాటులోకిి వచ్చేశాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2తో పాటు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రేజర్ సహా మలయాళ, తమిళ డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి పూర్తి లిస్ట్ ఓసారి చూస్తే...

ధురంధర్ 2 - బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, అన్‌మ్యూటెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

రేజర్ - రవిబాబు స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ రేజర్. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో శుక్రవారం నుంచి అందుబాటులోకిి వచ్చేసింది. రవిబాబుతో పాటు తనీష్, ఇనయా సుల్తాన్, మీనా వాసు, చైల్డ్ ఆర్టిస్ట్ తేజల్ విఖ్యాతి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

మరీచిక - రెజీనా, అనుపమ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మరీచిక సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చేసింది.

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 - ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం - పావని గంగిరెడ్డి, చైతన్య కృష్ణ - దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ సిరీస్ 'సేవ్ ది టైగర్స్ 3'. వెన్నెల కిశోర్ కూడా కీలకపాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?