సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించిన 'విత్ లవ్'ను తెలుగులోనూ విడుదల చేశారు. ఆ సినిమా కాకుండా తెలుగులో అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నవీన్ చంద్ర 'హానీ' నుంచి గుణశేఖర్ 'యుఫోరియా' వరకు ఫిబ్రవరి 6న అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మరి, ఏ సినిమా కలెక్షన్ ఎంత? ఏ సినిమాకు ఓపెనింగ్ బావుంది? అనేది తెలుసుకోండి.

'విత్ లవ్'... తెలుగు, తమిళ భాషల్లో కోటిన్నర!
With Love Movie Box Office Collection Day 1: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్, 'ఛాంపియన్' హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'విత్ లవ్'. ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకు మొదటి రోజు ఇండియాలో కోటిన్నర నెట్ కలెక్షన్ వచ్చింది. చిన్న సినిమాకు ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు.

Also Read: With Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

గుణశేఖర్ 'యుఫోరియా'... 'విత్ లవ్' కంటే తక్కువ!
Gunasekhar Euphoria Box Office Day 1 Collection: గుణశేఖర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'యుఫోరియా'. 'ఒక్కడు' తర్వాత భూమిక చావ్లాతో ఆయన చేసిన చిత్రమిది. 'ధురంధర్' విజయం తర్వాత సారా అర్జున్ నటించిన సినిమా కావడంతో హిందీ ప్రేక్షకుల చూపు కూడా పడింది. ఓపెనింగ్ డే ఇండియాలో ఈ సినిమా 70 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది.

Also Read: Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

Naveen Chandra Honey Movie First Day Collection: నవీన్ చంద్ర హీరోగా కరుణ కుమార్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సినిమా 'హానీ'కి ఇండియాలో మొదటి రోజు 10 లక్షల గ్రాస్ వచ్చింది.

Amardeep Chowdary's Sumati Satakam Box Office Collection Day 1: అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన తాజా సినిమా 'సుమతి శతకం'. ఇండియాలో ఈ సినిమాకు ఓపెనింగ్ డే 5 లక్షల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. 'శ్రీ చిదంబరం గారు' చిత్రానికి 10 లక్షల గ్రాస్ వచ్చింది. 'ఎర్ర చీర' అయితే మరీ దారుణం. ఆ చిత్రానికి కనీసం లక్ష రూపాయల నెట్ కూడా రాలేదు. 'లగ్గం' వంటి సినిమాలకు అయితే థియేటర్లకు ప్రేక్షకులు ఎవరూ రాలేదు.

Also Read: Renu Desai: ఏడేళ్ల వయసులో జరిగిన ఘటన... రేణూ దేశాయ్‌ నాన్ వెజ్ మానేయడానికి కారణం ఇదే