Free Sanitary Napkins: ఏపీలో 7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: నారా లోకేష్

3 months ago 12
ARTICLE AD
<p>Nara Lokesh Speech In AP&nbsp;&nbsp;Legislative Council |&nbsp;అమరావతి: రాష్ట్రంలో 7వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలోని విద్యార్థులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను అందించడంపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. &lsquo;ప్రభుత్వ విద్యాసంస్థల్లో 7వ తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్ లను సరఫరా చేయడం జరుగుతోంది. గతంలో ఏడు రెగ్యులర్ సైజ్, మూడు లార్జ్ సైజ్ న్యాప్ కిన్ లు ఇచ్చేవారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజ్, 5 లార్జ్ సైజ్ శానిటరీ ప్యాడ్ ను ప్రభుత్వం అందజేస్తోంది.</p> <p>గత ప్రభుత్వంలో 18.96 కోట్ల బకాయిలు పెట్టారు. ప్రజా ప్రభుత్వం ఆ బకాయిలను తీర్చడం జరిగింది. ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. 96శాతం బాలిలకు తమకు శానిటరీ న్యాప్ కిన్ లు అందుతున్నాయని, 4 శాతం మంది అందడం లేదని చెప్పడం జరిగింది. నాణ్యత విషయంలో 1 శాతం బాగాలేదని, 14శాతం పర్వాలేదు, బాగుందని 85శాతం మంది చెప్పారు. శానిటరీ న్యాప్ కిన్స్ ఎబ్సార్ ప్షన్ పై 84శాతం మంది బాగుందని, 14 శాతం మంది పర్వాలేదని, బాగాలేదని 2శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సైజ్ విషయంలో 89శాతం మంది బాగుందని, 11శాతం బాగాలేదన్నారు.&nbsp;&nbsp;</p> <p>ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ పంపిణీపైనా చర్చించాం. దీనిపైనా పరిశీలన చేస్తాం. ఎన్జీవోలతో మాట్లాడి బాలికల్లో అవగాహన పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. వెండింగ్ మిషన్స్ విత్ స్మార్ట్ కార్డ్ ను ఇప్పటికే కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. అన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటాం. హెచ్ పీవీ వ్యాక్సిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదో క్యాంపెయిల్ లా చేస్తాం. దీనిపై అనేక అపోహలు ఉన్నాయి. ఇది అవసరం. అందరం కలిసికట్టుగా దీనిపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని&rsquo; మంత్రి లోకేష్ చెప్పారు. &nbsp;&nbsp;</p> <p>అంతముందు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ.. విద్యార్థినులకు నెలసరి వచ్చే సమయంలో సరైన హైజీన్ ప్రొడక్ట్స్ అందక పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదవుతున్న బాలికలకు ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ కచ్చితంగా అందించాలని ప్రభుత్వాన్నికోరారు.</p>
Read Entire Article