Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

3 weeks ago 4
ARTICLE AD
<p>హైదరాబాద్&zwnj;: తెలంగాణ ప్రభుత్వం సీరియస్&zwnj;గా తీసుకున్న ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు కీలక అడుగు వేశారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో అధికారులు సోమవారం (మార్చి 23న) ఛార్జిషీట్&zwnj; దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&zwnj;ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్నారు. &nbsp;ఐఏఎస్&zwnj; అధికారి అర్వింద్&zwnj;కుమార్&zwnj; (A2), హెచ్&zwnj;ఎండీఏ మాజీ అధికారి బి.ఎల్.ఎన్ రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వర్&zwnj;రావు (A4), &nbsp;బ్రిటన్&zwnj;కు చెందిన ఎఫ్&zwnj;ఈవో సంస్థ (A5)లను ఈ కేసులో నిందితులుగా ఏసీబీ తమ ఛార్జ్ షీట్&zwnj;లో పేర్కొంది.&nbsp;</p> <p>గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ ఛార్జ్&zwnj;షీటులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్&zwnj;జెన్ సంస్థకు ఫార్ములా ఈ కారు రేస్ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించినందుకుగానూ ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో <a title="బీఆర్ఎస్ పార్టీ" href="https://telugu.abplive.com/topic/BRS-Party" data-type="interlinkingkeywords">బీఆర్ఎస్ పార్టీ</a>కి రూ.45 కోట్లు అందాయని ఏసీబీ చెబుతోంది. ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది నవంబర్&zwnj;లోనే ఈ కేసులో కేటీఆర్&zwnj;ను విచారించేందుకు అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి ఇచ్చిన తరువాత విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది.</p> <p>కాగా, ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18, 2024న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. నగదు సంబంధిత అంశం కావడంతో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగంతో పాటు నేరపూరిత కుట్ర జరిగిందని ఏసీబీ ఛార్జిషీట్&zwnj;లో పేర్కొనడంతో కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది.</p>
Read Entire Article