<p>Shikha Goyal About FSL fire accident | హైదరాబాద్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్‌ఎల్ డైరక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. 2 కీలక కేసులకు సంబంధించిన డేటా ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు.</p>
<p>నాంపల్లిలోని ఎఫ్ఎస్‌ఎల్ ఆఫీసులో శనివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మంటలను మొదట ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగి గుర్తించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యపడలేదని.. అదే సమయంలో మంటలు క్రమంగా ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్, ట్రైనింగ్‌ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు. </p>
<p>అనాలసిస్ డాక్యుమెంట్ లో కొన్ని ఫైల్స్ దగ్దం కాగా, వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు శిఖా గోయల్ తెలిపారు. ఈ ప్రమాదంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవలం లేదన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు.</p>
<p>2015లో నమోదైన ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశామన్నారు. ఓటుకు నోటు కేసు పూర్తి రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలిపోయిన ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయని తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను సైతం ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశాం. 7 ఆధారాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ఉంచుతందని, డేటాను టీమ్ రిట్రీవ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.</p>