Turkish Airlines Flight Emergency Landing in Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ వెలుడవడింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కోల్‌కతా విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ విమానం టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా భావిస్తున్నారు.

ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గమనించిన పైలట్

టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం THY727 ఖాట్మండు నుంచి ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. కోల్‌కతా గగనతలంపై ఎగురుతున్నప్పుడు, ఇంజిన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగడం పైలట్ గమనించాడు. ఆ తర్వాత విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరగా ల్యాండ్ అయింది. పైలట్ వెంటనే కోల్‌కతా ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ని సంప్రదించాడు. విమానాశ్రయ అధికారులు వెంటనే అనుమతి మంజూరు చేశారు. అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రయాణీకులు వేచి ఉన్నారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం కూడా అత్యవసరంగా ల్యాండింగ్

రెండు రోజుల క్రితం, బాంబు బెదిరింపు రావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానాన్ని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే, తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్దారించారు. అప్పుడు అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించారు.

బాంబు ఉన్నట్టు కాగితంలో రాసి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

దీనికి ముందు, విమానంలో ఒక కాగితం ముక్క దొరికింది. విమానంలో బాంబు ఉందని, ఎప్పుడైనా పేలిపోవచ్చని అందులో పేర్కొంది. వెంటనే, సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించడంతో అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసింది. వారణాసి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ గురించి సమాచారం అందిన వెంటనే, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక యంత్రాలు, CISF సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రయాణీకులను కూడా ప్రోటోకాల్ ప్రకారం పరీక్షించారు. INDIA,