ప్రభాస్ (Prabhas)ను రెబల్ స్టార్ అని పిలవడం ఫ్యాన్స్, ఆడియన్స్‌కు అలవాటు. అయితే ఆయనకు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని ట్యాగ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ట్యాగ్ ఏదైనా సరే తమ అభిమాన కథానాయకుడిలో 'డార్లింగ్'ని చూసుకుంటున్నారు ఫ్యాన్స్. అటువంటి డార్లింగ్ సరసన 'ఫౌజీ'తో కథానాయికగా పరిచయం అవుతోంది ఇమాన్వి. ఇప్పుడు ఆవిడ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. అది చూశారా?

ఇమాన్వి డ్యాన్స్... నెటిజన్స్ ఫేవరెట్!
'ఫౌజీ' టైటిల్ అనౌన్స్ చేయక ముందు సంగతి... అసలు ఈ సినిమా మొదలు కాక ముందు సంగతి... 'సీతా రామం' వంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత ప్రభాస్ హీరోగా సినిమా చేసే అవకాశం హను రాఘవపూడికి వచ్చింది. 'సీతా రామం'తో మృణాల్ ఠాకూర్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఆయన... ఈసారి ప్రభాస్ సినిమాకు హీరోయిన్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారోనని ఆడియన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మృణాల్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ భామలు చాలా మంది పేర్లు వినిపించాయి. చివరకు ఆ అవకాశం ఇమాన్వి సొంతం అయ్యింది.

Also Read: రజనీకాంత్ 'జైలర్ 2'లో బాలీవుడ్ భామ.. విలన్ కూతురిగా!?

ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ సొంతం చేసుకున్న ఈ ఇమాన్వి ఎవరు? అని ఆడియన్స్ ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బయట పడింది ఆవిడ వైరల్ డ్యాన్స్ వీడియో. ఇమాన్వి క్లాసికల్ డ్యాన్సర్. సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ చేసిన ఓ డ్యాన్స్ రీల్ వైరల్ అయ్యింది. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రావడానికి ఒక విధంగా ఆ వీడియో కారణం అని చెప్పాలి. ఇప్పుడు మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించింది ఇమాన్వి. సోషల్ మీడియాలో లేటెస్టుగా ఒక రీల్ షేర్ చేసింది. అది వైరల్ అవుతోంది. కింద ఉన్న లింక్‌లో ఆ రీల్ చూడండి.

Also Read: బాలకృష్ణకు జంటగా మరోసారి నయనతార... ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలో!

ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న 'ఫౌజీ' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఈ సినిమాలో జయప్రద, అనుపమ్ ఖేర్, భానుచందర్, మిథున్ చక్రవర్తి తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.