Madya Pradesh Man shoots daughter in front of cops : ప్రపంచం ఎంతో మారుతున్నా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు మాత్రం కులం, మతం, ప్రాంతం పేరుతో కుమార్తెల జీవితాల్ని అంధకారంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదు. తమ మాటే నెగ్గాలని వారు పంతానికి పోతూ... ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఓ ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మహేంద్ర గుజ్జార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు తను గుజ్జార్. ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిర్చాడు మహేంద్ర గుజ్జార్. అయితే తండ్రి సెలక్ట్ చేసిన పెళ్లి కొడుకు తను గుజ్జార్ కు నచ్చలేదు.తాను అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తన జీవిత భాగస్వామిగా ఎవరు ఉండాలో తానే నిర్ణయించుకుంటానని చెప్పింది. అయితే తన కుమార్తె తన మాట విని తీరాల్సిందేనని ఆ తండ్రి పంతానికిపోయాడు. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేయించి బంధు మిత్రులకు పంచడం ప్రారంభించాడు.

అయితే తను గుజ్జార్ మాత్రం తాను చావనైనా చస్తాను కానీ ఈ పెళ్లికి మాత్రం అంగీకరించేది లేదని చెబుతూ వస్తోంది. దీంతో గుజ్జార్ కమ్యూనిటీ పెద్దల ముందు పంచాయతీ పెట్టాలని మహేంద్ర గుజ్జార్ నిర్ణయించారు. ఆయన విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ పెద్దలు సమావేశం పెట్టారు. అక్కడ చాలా మంది తను గుజ్జార్ కు నచ్చే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం.. తన జీవితంలోకి ఎవరైనా వస్తే అది తన చాయిస్ ప్రకారమే రావాలని..తన తండ్రి నిర్ణయించిన వ్యక్తితో తాను జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేశారు.

Also Read: Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?

ఇలా వాదోపవాదాలు పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా బుల్లెట్ శబ్దం వినిపించింది.దీంతో అందరూ అవాక్కయ్యారు. ఏం జరిగిందో చూసేసరికి మహేంద్ర గుజ్జార్ చేతిలో తుపాకీ ఉంది. తను గుజ్జార్ బుల్లెట్ గాయంలో రక్తపు మడుగులో ఉన్నారు.దీంతో మహేంద్ర గుజ్జార్ తన కుమార్తెను కాల్చి చంపేశాడని అర్థమయింది. దీంతో కమ్యూనిటీ పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిజానికి పోలీసులు కూడా ఆ సమీపంలోనే ఉన్నారు. అయితే ఇది కుటుంబ సమస్య కావడంతో వారే పరిష్కరించుకుంటారని జోక్యం చేసుకోలేదు.కానీ కుమార్తెను చంపుతారని వారు కూడా ఊహించలేకపోవడంతో ఘోరం జరిగిపోయింది.

తను గుజ్జార్ ఓ యుువకుడ్ని ప్రేమిస్తోందని.. అతనితోనే పెళ్లి అని స్ష్టం చేయడంతో తన పరువు పోతుదంని కుమార్తెను తండ్రి చంపేశాడని భావిస్తున్నారు. కుమార్తెను చంపిన తండ్రిగా ఇప్పుడు ఆయనకు చాలా పరువు వస్తుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read :Viral Video: ఇతను 2050లో పుట్టాల్సిన వ్యక్తి - ఈవీ కార్‌తో పూరీలు చేసేస్తున్నాడు !