శ్రీ విష్ణు (Sree Vishnu), దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju) కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఠక్కున 'సామజవరగమన' సినిమా (Samajavaragamana Movie) గుర్తుకు వస్తుంది. ప్రేక్షకులకు వినోదం అందించడమే కాదు... బాక్సాఫీస్ బరిలో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. ఆ సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది.

శ్రీవిష్ణు కొత్త సినిమా... 'ఫ్యామిలీ ప్యాక్'
Sree Vishnu New Movie Titled Family Pack: శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కలయికలో కొత్త సినిమాకు 'ఫ్యామిలీ ప్యాక్' టైటిల్‌ ఖరారు చేశారని సమాచారం. సాధారణంగా ఫ్యామిలీ ప్యాక్ అంటే బిర్యానీ గుర్తుకు వస్తుంది. ఫ్యామిలీ అందరికీ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవడం చాలా మందికి అలవాటు. ఇప్పుడు శ్రీ విష్ణు సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేయడంతో కుటుంబ ప్రేక్షకులు అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా చేస్తున్నారని ఆశించవచ్చు.

Also Read: Salman Khan Kumod Raney Relationship - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే?

'ఫ్యామిలీ ప్యాక్' టైటిల్‌కు తగ్గట్టే కంప్లీట్ కామెడీ, ఎమోషన్స్ ఉంటాయని, కుటుంబ సభ్యులు అందరూ చూసేలా ఉంటుందని తెలుస్తోంది. 'సామజవరగమన' తర్వాత శర్వానంద్ హీరోగా 'నారి నారి నడుమ మురారి' తీశారు రామ్ అబ్బరాజు. ఆ సినిమా కామెడీ కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి శ్రీవిష్ణుతో ఎటువంటి సినిమా చేస్తారో చూడాలి. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Balakrishna Birthday Special - రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్

Sree Vishnu Upcoming Movies: రామ్ అబ్బరాజు దర్శకత్వంలో 'ఫ్యామిలీ ప్యాక్' సినిమా కాకుండా 'కామ్రేడ్ కళ్యాణ్' అని మరో సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు. ఈ ఏడాది 'నారి నారి నడుమ మురారి'లో అతిథి పాత్రతో సంక్రాంతికి సందడి చేశారు శ్రీ విష్ణు. ఆ తర్వాత సోలో హీరోగా 'విష్ణు విన్యాసం', 'ముత్యుంజయ' సినిమాలతో, ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'గాయపడ్డ సింహం'లో ప్రత్యేక పాత్ర చేశారు.

Also Read: Peddi Collections Day 6 - 'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?