Director Gunasekhar About Euphoria Movie OTT Deal : చాలా రోజుల గ్యాప్ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రెస్ మీట్‌లో గుణశేఖర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

'యుఫోరియా' ఓటీటీపై...

'యుఫోరియా' మూవీ ఇప్పట్లో ఓటీటీలో రాదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు గుణశేఖర్. 'ఈ మూవీ కేవలం థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరినీ గౌరవించి తీసిన సినిమా. సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదు. కేవలం థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి. తప్పకుండా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్టోరీలో పిల్లలు, పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే, పిల్లలు చూడాలి, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా.

వారు విడివిడిగా చూస్తే ప్రాబ్లమ్ లేదు. అందుకే A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది పేరెంట్స్, పిల్లలు కలిసి చూడలేకపోయినా ఎవరికి వారే చూడాల్సిన సినిమా. కొందరు డైరెక్టర్స్, సెలబ్రిటీలు సినిమా చూసి భయం వేస్తుందని అంటున్నారు. మన ఇంట్లో ఇలా జరుగుతుందా అని అడిగారు?. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్‌నే మూవీలో రిఫ్లెక్ట్ చేసినట్లుగా ఉందన్నారు.' అని చెప్పారు.

Also Read : యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్‌పై కేసు - బూతు పాట కాంట్రవర్సీపై వార్నింగ్... జర్నలిస్ట్ కంప్లైంట్‍‌తో...