Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర రాత్రి మొత్తం అడవిలో బాలతో ఉండటంతో శుద్ధి చేయాలి అని రత్నమాల ఆరుబయట త్రిపుర మీద పసుపు నీరు చల్లిస్తుంది. త్రిపుర ఏడుస్తుంది. అడ్డుకోవడానికి గాయత్రీ వెళ్లబోతే రత్నమాల గాయత్రీని వదలదు. మనవరాలి పరిస్థితిని చూసి తాత ఏడుస్తారు. గాయత్రీ అత్త నుంచి విడిపించుకొని అక్క దగ్గరకు పరుగు పెట్టి అక్కని ఎవరూ చూడకుండా హగ్ చేసుకొని గదిలోకి తీసుకెళ్తుంది.

రత్నమాల తండ్రితో మైల పోయింది కదా ఇప్పుడు ఊరి ఆచారం ప్రకారం మంగళ సూత్రం, మెట్టెలు అమ్మవారికి సమర్పించి త్రిపురకు ఇస్తానని అంటుంది. గుడికి వెళ్లడానికి త్రిపురను రెడీ చేయమని రమాప్రభతో చెప్తుంది. మరోవైపు యశోద తన కొడుకుకే ఇన్ని కష్టాలు అని మహారాజులా ఉండే వాడిని పిల్లాడిని చేసేశావు.. ఇప్పుడు పుట్టిన రోజునాడే దూరం చేశావని ఏడుస్తుంది. బాలకి ఏం కాదని భర్త ధైర్యం చెప్తాడు. ఇక బామ్మ బాల త్రిపుర సుందరి అమ్మవారికి బాల క్షేమంగా తిరిగి వస్తే బంగారు నగ సమర్పిస్తానని మొక్కుకుంటుంది. నాగభూషణం భార్యాకొడుకుతో వాడు ఇక తిరిగి రాడని అంటాడు. ఇంతలో బాల వచ్చి యశోదని హగ్ చేసుకుంటాడు. బాలని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఎక్కడికి వెళ్లావు ఏమైందని అంటే బాల తనని కొంత మంది తీసుకెళ్లిపోయారని కిడ్నాప్ గురించి చెప్తాడు.

రౌడీలు తనని పొడవబోతే సుందరి వచ్చి కాపాడిందని అంటాడు. భర్త్‌డే కూడా చాలా గ్రాండ్‌గా చేసిందని మీరు కూడా ఎప్పుడు అంత గ్రాండ్‌గా చేయలేదని అంటాడు. ఇక అనంత్‌ బాలని గదిలోకి తీసుకెళ్తాడు. సుందరి ఉందా లేక బాల ఊహా అని యశోద అంటే సుందరి కచ్చితంగా ఉందని రక్షతాడు కూడా కట్టిందని ప్రతీసారి ఆ సుందరే కాపాడుతుందని అంటుంది. సుందరి నిజంగా అమ్మవారు అయితే నా కొడుకుని పూర్తిగా నయనం చేయొచ్చు కదా అంటుంది. ఇక బామ్మ అమ్మవారికి నగ సంపాదించాలని అంటుంది. మరోవైపు త్రిపుర వాళ్లని తీసుకొని బాజాభజంత్రీల మధ్య గుడికి తీసుకెళ్తుంది. గాయత్రీని కూడా తాత గుడికి రమ్మని అంటే అక్క జీవితం నాశనం అవ్వడం కల్లారా చూడాలా తాత అంటుంది. అమ్మవారికి ఈ పెళ్లి ఆపమని మొక్కుకోవడానికి గుడికి వస్తానని గాయత్రీ బయల్దేరుతుంది.

బాలాత్రిపుర సందరి అమ్మవారికి నగ సమర్పించడానికి బాలని తీసుకొని అతని కుటుంబం వస్తుంది. పది లక్షలు పెట్టి నగలు కొని అమ్మవారికి ఇస్తుంది అదంతా మన డబ్బే కదా అని నాగభూషణం నోరెళ్లబెడతాడు. వీళ్లు ఎంత ఖర్చు పెట్టానా బాలని మనం మామూలు మనిషి చేయమని వాసుకి అంటుంది. బామ్మ వాళ్లు పూజారికి నగ ఇస్తామని అంటే పంతులు ప్రత్యేకమైన పూజ చేసి అప్పుడు నగ అమ్మవారికి సమర్పించండి అంటుంది. పంతులు బాలతో పూల దండ గుచ్చి అమ్మవారికి ఇవ్వాలని అంటారు. అందరూ కూర్చొని బాలతో దండ గుచ్చిస్తారు. బాల బాలేని రెండు గులాబీలను పట్టుకొని పిన్ని బాబాయ్‌లా ఉన్నాయని విసిరేస్తారు. ఇక మరో పువ్వు పట్టుకొని నా సుందరిలా చాలా అందంగా ఉందని ముద్దాడుతాడు. రత్నమాల పూజారికి చీర, తాళిబొట్టు, మెట్టెలు ఇచ్చి పూజ చేయమని అంటుంది. త్రిపుర అన్న వదినలు పెళ్లి ఇష్టం లేదని మేం ఇక్కడ ఉండమని వెనక్కి వెళ్లిపోతారు. ఇక గాయత్రీ, ఊర్వశిలతో త్రిపురని తీసుకెళ్లి ప్రదక్షిణలు చేయించమని రత్నమాల చెప్తుంది.

ఊర్వశి అనంత్‌ని చూసి మురిసిపోతుంది. తల్లి వచ్చి అడిగితే రిచ్చో రిచ్ నీకు కాబోయే అల్లుడు అతనే అంటుంది. అల్లుడు చాలా బాగున్నాడని కోట్లు ముఖంలో కనిపిస్తున్నాడని మాట్లాడి బుట్టలో వేసుకోమని అంటుంది. ఇక అనంత్ గాయత్రీని చూసి గాయత్రీ సైగలు చేసి గాయత్రీని పిలుస్తాడు. అనంత్ గాయత్రీకి సైగలు చేయడం గాయత్రీ రావడం కుదరదు అని సైగలు చేయడం ఊర్వశి చూస్తుంది. అనంత్ గాయత్రీని ఫాలో అవుతూ మాట్లాడటానికి బతిమాలుతూ పిలవడం ఊర్వశి చూస్తుంది. గాయత్రీ అనంత్ దగ్గరకు వెళ్లడం చూసి ఫాలో అవుతుంది. ఎవరూ చూడకుండా గాయత్రీ, అనంత్ ఓ చోట కలుసుకుంటారు. ఇద్దరూ మాట్లాడుకోవడం ఊర్వశి చూస్తుంది. మా అక్కకి పెళ్లి పెళ్లి ఇష్టం లేదని మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!