Ennallo Vechina Hrudayam Serial Today February 1st Episode బాల, త్రిపురలు గిరి పంపిన రౌడీల నుంచి తప్పించుకొని ఓ చోట ఉంటారు. బాల తన పుట్టిన రోజు కేక్ కట్ చేయలేదని ఫీలవుతాడు. మరోవైపు గాయత్రీ, అనంత్‌లు అక్కా, అన్నల కోసం వెతుకుతుంటారు. గాయత్రీ చలికి వణుకుతుంటే అనంత్ తన కోట్ తీసి గాయత్రీకి కప్పుతాడు. ఇక త్రిపుర బాల కళ్లు మూసి ఓ చోటుకి తీసుకెళ్తుంది. అక్కడ వాటర్మెలాన్ పండుతో కేక్‌లా చేసి దాని మీద రేగిపళ్లు డెకరేషన్‌లా పెడుతుంది.

త్రిపుర ఏర్పాటు చేసిన ఆ కేక్ చూసి బాల చాలా బాగుందని కేక్ కట్ చేస్తాడు. ఇది తన బెస్ట్ బర్త్‌డే అని చెప్తాడు. ఇక త్రిపుర కేక్‌లా వాటర్ మెలాని తినిపించి నేల పనస గిఫ్ట్‌గా ఇస్తుంది. గాయత్రీ, అనంత్‌లు బాల, త్రిపుర వెలిగించిన నిప్పు దగ్గర కూర్చొంటారు. గాయత్రీ టెన్షన్‌ పడుతుంటే అనంత్ ధైర్యం చెప్తాడు. మరోవైపు గిరి వాళ్లు బాల వాళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. త్రిపుర బాల ఓ చోట కూర్చొంటారు. బాలకు నిద్ర వచ్చి ఆవలింతలు తీస్తూ త్రిపుర భుజం మీద వాలిపోతాడు. తర్వాత త్రిపుర ఒడిలో పడుకుండి పోతాడు. త్రిపుర బాలకు జో కొడుతుంది. ఇంతలో అక్కడికి సీతా కోక చిలుక వచ్చి బాల తల మీద వాలుతుంది. త్రిపుర దాన్ని పక్కకు నెట్టేస్తుంది. గిరి వాళ్లు ఎక్కడున్నారురా అంటే వదినకు అడవి మొత్తం తెలుసు కదా అన్న వేరే దారిలో ఇంటికి వెళ్లుంటారని అనడంతో గిరి వాళ్లు వెళ్లిపోతారు.

ఉదయం త్రిపుర, బాలని తీసుకొని ప్రకృతి వైద్యశాల దగ్గరకు వస్తుంది. ఇక త్రిపుర తన గురించి అందరూ కంగారు పడుతుంటారని ఇంటికి బయల్దేరుతుంది. త్రిపుర వెళ్లిపోవడంతో బాల డల్ అయిపోతాడు. ఇక గాయత్రీ, అనంత్‌లు బాల దగ్గరకు వస్తారు. బాల జరిగింది అంతా తమ్ముడితో చెప్తాడు. ఇక అనంత్ బాలని ఇంటికి తీసుకెళ్తానని ఈలోపు మీ అక్క రాకపోతే నాకు చెప్పు నేను వస్తా పోలీసులకు చెప్దామని అంటాడు. గాయత్రీ సరే అని ఇంటికి వెళ్లి చూసి చెప్తానని అంటుంది. రత్నమాల ఇంటికి కొందరు ఆడవాళ్లు పెళ్లి పనులు చేయడానికి వస్తారు. అందరూ పనులు చేస్తూ కాబోయే కోడలు అమాయకుడితో లేచిపోతే ఇంత ధీమాగా ఉంది.. ఈ రౌడీ కంటే ఆ అమాయకుడే మేలని అనుకుంటారు.

దాంతో రత్నమాల వెళ్లి వాళ్ల మీద అరుస్తుంది. గిరి త్రిపుర కోసం ఆరు బయటే కూర్చొని ఉంటాడు. అందరూ టెన్షన్‌గా త్రిపుర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో త్రిపుర ఇంటికి వస్తుంది. త్రిపుర ఇంటి లోపలికి వెళ్తుంటే గిరి త్రిపురని ఆపి ఇంత వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే.. పసుపు దంచిన తర్వాత వెళ్లొద్దని చెప్తే ఎందుకు వెళ్లావని అడుగుతాడు. దాంతో త్రిపుర నీ వల్లే వెళ్లాను అని బాలని చంపాలనుకున్న విషయం చెప్తుంది. నేను పొలిమేర దాటడం తప్పు అయితే ఓ వ్యక్తిని చంపాలి అనుకోవడం తప్పు కదా అంటుంది.

ఇంతలో రత్నమాల వచ్చి వాడు ఎవడో ఏమైపోతే నీకు ఏంటే.. ఊరిలో అందరూ నువ్వు లేచిపోయావని అంటున్నారని అరుస్తుంది. రత్నమాల త్రిపురలో నువ్వు మైల పడిపోయావే నీకు శుద్ధి చేయాలి అంటుంది. గాయత్రీ కూడా వచ్చి మీరు ఇద్దరూ శుద్ధి చేయాలని అంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా రత్నమాల వినకుండా త్రిపురని లాక్కెళ్తుంది. ఇలా చేయొద్దని తండ్రి చెప్పినా రత్నమాల వినదు. అందరూ చూస్తుండగానే త్రిపుర మైల పోగొట్టాలని ఆరు బయట త్రిపురని కూర్చొపెట్టి పసుపు నీటితో స్నానం చేయిస్తుంది. త్రిపుర చాలా ఏడుస్తుంది. గాయత్రీ పరుగున వెళ్లి అక్కని హగ్ చేసుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!