Ennallo Vechina Hrudayam Serial Today Episode దేవాకి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. దేవా షర్ట్, చైన్ బామ్మకే ఇవ్వమని చెప్తాడు. బాబాయ్‌తో పాటు అక్కడున్న నలుగిరితో షర్ట్ విప్పించిన దేవా ఫ్యాంట్ తీస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానంటాడు. తప్పని పరిస్థితిలో అందరూ విప్పుతారు. అందరి బట్టలు తీసుకొని దేవా పరుగులు పెడతాడు. దేవా వెనక కొందరు బట్టల కోసం మరి కొంత మంది పరుగులు తీస్తారు.

కాళ్ల పని చేయడం లేదని ఆశ్రమంలో తిండి సేవలు చేయించుకోవడానికి ఉంటున్న వ్యక్తి దగ్గరకు దేవా వెళ్తాడు. అంకుల్ మీ కాళ్లు పని చేయడం లేదా అంటాడు. అవునని ఆయన అంటే దేవా కాళ్లని గిల్లేస్తాడు. నొప్పి వస్తున్నా లేదని చెప్తాడు. దాంతో దేవా కాళ్లతో కుమ్మి తంటాడు. బలం మొత్తం ఉపయోగించి కాళ్ల మీద నిల్చొంటాడు. నొప్పి మొత్తం దాచుకొని నోరు అదిమి పెట్టుకుంటాడు. బట్టల కోసం వాళ్లు ఫాలో అవ్వడంతో బాల వెళ్లిపోతాడు.

నాగభూషణం దగ్గరకు వాసుకి వెళ్తుంది. ఆ అవతారం చూసి దడుచుకుంటుంది. నా అవతారం సంగతి తర్వాత ముందు ఒకామె కాషాయం నూరుతుంది అందులో నేను ఇచ్చిన మందు కలుపు అంటాడు. వాసుకి వెళ్లి తన బంగారం గాజు కింద పడేసి ఆ అమ్మాయికి గాజు వెతకమని ఈలోపు తను కషాయంలో తన వెంట తెచ్చుకున్న మందు కలిపేస్తుంది. విషయం తెలియని ఆ అమ్మాయి కాషాయం సిద్ధం చేసి తీసుకెళ్తుంటే బాల ఆమెకు తగలడంతో కషాయం కింద పడిపోతుంది. ఇంతలో త్రిపుర ఆశ్రమానికి వస్తుంది. త్రిపుర వస్తూ బామ్మని ఢీకొడుతుంది. బాల షర్ట్, చైన్ కింద పడిపోతాయి. త్రిపుర తీసి ఇస్తుంది. కానీ చైన్‌లో తన రింగ్ చూడదు. త్రిపురను చూసిన బామ్మ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందని యశోదతో చెప్తుంది. ఇక బాల చెట్టు ఎక్కడం చూసి అక్కడికి వెళ్తుంది. త్రిపుర పిలిస్తే బాల కిందకి వస్తాడు. కషాయం తాగను అని బాల అంటే అలా అనకూడదు అని త్రిపుర బాల చేయి పట్టుకొని తీసుకెళ్తుంది.

త్రిపుర బాల కోసం కషాయం నూరుతుంది. త్రిపుర ఇంటికి గిరి వస్తాడు. ఫోన్ మర్చిపోయానని వచ్చానని అంటాడు. దాంతో ఊర్వశి నిజం చెప్పు బావ ఫోన్ కావాలని మర్చిపోయావ్ కదా అంటుంది. గిరి సిగ్గుపడతాడు. తర్వాత త్రిపుర గురించి అడుగుతాడు. ప్రతీ ఆదివారం సేవ చేయడానికి ప్రకృతి వైద్యశాలకి వెళ్తుందని ఈరోజు వెళ్లిందని రమాదేవి చెప్తుంది. త్రిపుర ఏం చేసినా నాకు చెప్పే చేయాలని గిరి అంటాడు. దాంతో త్రిపుర అన్నయ్య గిరి మీద ఫైర్ అవుతాడు. పెళ్లి అయిన తర్వాత నువ్వేమైన చెప్పుకో ఇప్పుడు తన ఇష్టం అని అంటాడు. దాంతో గిరి త్రిపుర ఎప్పుడైనా ఏం చేసినా నాకోసమే చేయాలి నాకే సేవ చేయాలి అంటాడు. నాతో మనువుకి ఒప్పుకున్న తర్వాత నాకు నచ్చినట్లు చేయాలని అంటాడు.

త్రిపుర బాల కోసం కషాయం నూరుతుంది. త్రిపుర దగ్గరే బాల కూర్చొంటాడు. త్రిపురకు బాల కాల్ చేస్తాడు. త్రిపుర కట్ చేస్తుంది. మళ్లీ కాల్ చేస్తాడు. మళ్లీ కట్ చేస్తుంది. మూడో సారి చేస్తే బాల కాల్ లిఫ్ట్ చేసి ఒకసారి చేసినా లిఫ్ట్ చేయలేదు అంటే బిజీ అని అర్థం రెండో సారి చేసినా లిఫ్ట్ చేయకపోతే చాలా చాలా బిజీ అని మూడోసారి చేసినా లిఫ్ట్ చేయకపోతే మీతో మాట్లాడటం ఇష్టం లేదని సుందరికి కాల్ చేయకు అని ఫోన్ కట్ చేసేస్తారు. దాంతో గిరి రగిలిపోతాడు. తల్లి మాటలు గుర్తు చేసుకొని ఆగిపోతాడు. ఇక త్రిపుర బాలకి కషాయం తాగమంటే తాగను అని తోసేస్తాడు. దాంతో త్రిపుర చేతికి చిన్న గాయం అవుతుంది. రక్తం వస్తుంది. బాల కట్టుకట్టుకోమని అంటే కషాయం తాగితేనే కట్టుకట్టుకుంటానని అంటుంది. దాంతో బాల తాగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!