AUS vs ENG Champions Trophy 2025: ఇంగ్లండ్‌కు బెన్ డకెట్ అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 165 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. 21 ఏళ్లుగా ఎవరూ సాధించలేని ఘనత సాధించి ఆసీస్‌ జట్టుకు గట్టి సవాల్ విసిరాడు.

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ వెనక్కి నెట్టేశాడు. వారి నెలకొల్పిన రిక్రాడును బ్రేక్ చేశాడు. నెట్టిఆస్ట్రేలియాపై 165 పరుగులు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 21 ఏళ్ల ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డును అవలీలగా అధిగమించాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ డకెట్ 3 సిక్సర్లు, 17 ఫోర్లతో 143 బంతుల్లో 165 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే భారీ వ్యక్తిగత స్కోరు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్‌ నాథన్ ఆస్టిల్ పేరిట ఉండేది. అతన్ని అధిగమించి టాప్‌లోకి వెళ్లాడు డకెట్‌.

న్యూజిలాండ్‌కు చెందిన నాథన్ ఆస్టిల్ 2004లో అమెరికాపై 145 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో సౌరవ్ గంగూలీ నాల్గో స్థానంలో, సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలో ఉన్నారు.

2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై గంగూలీ 141 పరుగులు, 1998లో ఆస్ట్రేలియాపై సచిన్ 141 పరుగులు సాధించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో 5 గొప్ప ఇన్నింగ్స్‌లు

బెన్ డకెట్ (ఇంగ్లాండ్), 165 vs ఆస్ట్రేలియా - 22 ఫిబ్రవరి 2025

నాథన్ ఆస్టిల్ (న్యూజిలాండ్), 145* vs USA - 10 సెప్టెంబర్ 2004

ఆండ్రూ ఫ్లవర్ (జింబాబ్వే), 145 vs ఇండియా - 14 సెప్టెంబర్ 2002

సౌరవ్ గంగూలీ (భారతదేశం), 141* vs దక్షిణాఫ్రికా - 13 అక్టోబర్ 2000

సచిన్ టెండూల్కర్ (భారతదేశం), 141 vs ఆస్ట్రేలియా - 28 అక్టోబర్ 1998

ఆస్ట్రేలియా లక్ష్యం 352 పరుగులు
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ డకెట్ తోపాటు జో రూట్ 68 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ మొదలైన తర్వాత బెన్ ద్వార్షుయిస్ 6 ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లను అవుట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా వ్యూహం ఫలించందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. బెన్ డకెట్, జో రూట్ ఇద్దరూ కలిసి 158 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రూట్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ కూడా 23 పరుగులు చేశాడు.

Also Read: పాక్‌ గడ్డపై భారత జాతీయ గీతం- వైరల్ అవుతున్న దృశ్యం

ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ చేసిన 320 పరుగులే అత్యధిక స్కోరు. ఇప్పుడు దాన్ని ఇంగ్లండ్ అధిగమించింది.

ఇంకా భారీ స్కోరు నమోదు కావాల్సింది కానీ... చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాట్సమెన్ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడ్డారు. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో వరుస వికెట్లు ఇంగ్లిష్ జట్టు కోల్పోయింది. కానీ జోఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో 21 పరుగులు చేసిన జట్టు స్కోరు 350 దాటడంలో కీలక పాత్ర పోషించాడు.

ఫామ్‌లో లేని ఆస్ట్రేలియా బౌలింగ్
ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్సమెన్‌ను చూసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. బెన్ ద్వార్షుయిస్ 10 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా, మార్నస్ లబుషేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఒక వికెట్ తీశాడు. నాథన్ ఎల్లిస్ తప్ప అందరు బౌలర్లు 6 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నారు.

Also Read:  క్రికెట్ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఎందుకు ఆలపిస్తారు? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందీ?