Elon Musk chat with Grok AI about Lord Ganesha: టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తన xAI కంపెనీ AI చాట్‌బాట్ గ్రోక్‌తో జరిపిన సంభాషణ సోషల్ మీడియాను ఆకర్షించింది. హిందూ దేవతలో ఒకరైన లార్డ్ గణేష్ గురించి AI ఖచ్చితమైన వివరాలు చెప్పడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. మస్క్ X లో షేర్ చేసిన ఈ చాట్ లింక్ క్షణాల్లో వైరల్ అయింది.

బ్రిటిష్-ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ మనోజ్ లాడ్వా మస్క్‌కు గణేష్ ప్రతిమను బహూమతిగా ఇచ్చారు. ఈ మూర్తి "విఘ్నాలు తొలగించడం, దైవిక ఆశీర్వాదాలు" ప్రతీక అని లాడ్వా మస్క్ కు తెిలపారు. మస్క్ ఈ మూర్తి ఫోటోను తీసి, గ్రోక్ AIకు అప్‌లోడ్ చేసి "ఇది ఏమిటి?" (What's this?) అని అడిగారు. గ్రోక్ తక్షణమే దీన్ని గుర్తించి, వివరంగా సమాధానమిచ్చింది.

"ఇది లార్డ్ గణేష్ విగ్రహం, హిందూ మతంలో విస్తృతంగా ఆరాధించే దేవుడు. ఏలిఫెంట్ హెడ్, చెవులు పెద్దవి, ట్రంక్ , నాలుగు చేతులు అక్షమాల, మోడక, పాషా, అభయ ముద్రలు , మోషక వాహనం ఉన్నాయి. ఇది సౌత్ ఇండియన్ బ్రాస్ స్టైల్‌లో తయారైనది. గణేష్ విఘ్నాలు తొలగించేవాడు, ప్రారంభాల దేవుడు, విజ్ఞానం, సంపద ప్రతీకాలు. హిందూ సంప్రదాయంలో ప్రారంభ కార్యక్రమాల్లో పూజిస్తారు." అని గ్రోక్ తెలిపింది.

ఈ స్పందనలో గ్రోక్ గణేష్ పురాణాలనూ వివరించింది. శివ-పార్వతీ కుమారుడు గణేష్ చతుర్థి పండుగలో ప్రత్యేకంగా పూజిస్తారు అని కథను వివరించింది. మస్క్ ఈ చాట్‌ను Xలో షేర్ చేస్తూ "హిడెన్ అటాచ్‌మెంట్" అని క్యాప్షన్ పెట్టారు, ఇది మరింత క్యూరియాసిటీ కలిగించింది.
Xలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో భారతీయ నెటిజన్లు స్పందించారు. "గ్రోక్ హిందూనా?" (Is Grok Hindu?) అని జోక్‌లు వేశారు. "సాంప్రదాయం, సాంకేతికత కలిసిన అద్భుత ఉదా హరణ" అంటూ ప్రశంసలు కురిపించారు. ఒక యూజర్ "ఎలాన్ మస్క్ గణపతి భక్తుడు అయిపోతాడేమో!" అని కామెంట్ చేశారు.

https://t.co/DCeEL1DGUh

— Elon Musk (@elonmusk) November 11, 2025

గ్రోక్, xAI AI మోడల్, భారతీయ సంస్కృతి, మతాలపై డీప్ నాలెడ్జ్ కలిగి ఉంది. ఇది మస్క్ "మ్యాక్సిమల్ ట్రూత్-సీకింగ్ AI" విజన్‌కు అనుగుణంగా డెవలప్ చేశారు. భారతదేశంలో గ్రోక్ యూజర్లు పెరుగుతున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్ xAIకి కొత్త మార్కెట్ బూస్ట్ ఇస్తోంది.