దీపావళి పండక్కి ముందు బాక్స్ ఆఫీస్ బరిలో రెండు మీడియం రేంజ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా 'తెలుసు కదా'. అక్టోబర్ 17న విడుదల. అదే రోజున తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'తెలుసు కదా'లో రాశీ ఖన్నా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు కావడం... 'డ్యూడ్'లో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ఉండటం వల్ల క్రేజ్ నెలకొంది. మరి, థియేట్రికల్ బిజినెస్ పరంగా అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఏ సినిమా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? మార్కెట్టులో ఎవరి సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది? అనేది చూస్తే...

తెలుగులో సిద్ధూ సినిమాదే అప్పర్ హ్యాండ్!
తెలుగులో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)కు అభిమానులు ఉన్నారు. 'డ్యూడ్' కంటే ముందు ఆయన నటించిన 'లవ్ టుడే', 'డ్రాగన్' సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టాయి. అయితే... ఆయన సినిమా కంటే సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'తెలుసు కదా' సినిమాకు ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

'తెలుసు కదా' (Telusu Kada) కంటే ముందు సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన 'జాక్: వీడు కొంచెం క్రాక్' బాక్స్ ఆఫీస్ బరిలో బోల్తా కొట్టింది. అయినా సరే సిద్ధూ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో 'తెలుసు కదా' థియేట్రికల్ బిజినెస్ రూ. 16.50 కోట్లు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'డ్యూడ్' బిజినెస్ రూ. 10 కోట్లు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో సిద్ధూ జొన్నలగడ్డ సినిమాదే అప్పర్ హ్యాండ్.

ఓవర్సీస్‌లో ప్రదీప్ రంగనాథన్ దూకుడు...
వరల్డ్ వైడ్ చూస్తే తమిళ్ హీరోది పైచెయ్యి!
రెండు తెలుగు రాష్ట్రాలు దాటి బయట ఏరియాలు చూస్తే... ప్రదీప్ రంగనాథన్ దూకుడు చూపించారు. ఓవర్సీస్ మార్కెట్టులో 'డ్యూడ్' డామినేషన్ స్పష్టంగా కనిపించింది. ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాకు ఓవర్సీస్ మార్కెట్టులో రూ. 12 కోట్లు బిజినెస్ జరిగితే... 'తెలుసు కదా'కు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే జరిగింది.

Also Read: మిత్ర మండలి రివ్యూ: ప్రియదర్శి & గ్యాంగ్ నవ్వించిందా? లేదా?... సినిమా హిట్టా? ఫట్టా?

ఇక తమిళనాడు, కర్ణాటకలో అయితే ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' దగ్గరలోనూ సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' నిలవలేదు. తమిళనాడులో సిద్ధూ సినిమాకు సరైన రిలీజ్ కావడం లేదు. ఈ సినిమాను తమిళ్, కన్నడలో విడుదల చేస్తామని పోస్టర్ మీద వేశారు. కానీ వర్క్ కంప్లీట్ కాలేదట. మరొక వైపు అక్కడ సరైన పబ్లిసిటీ చేయలేదు. తమిళనాడులో 'డ్యూడ్' రైట్స్ రూ. 31 కోట్లు. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఆ సినిమా రైట్స్ రూ. 6 కోట్లు. 'తెలుసు కదా' సినిమా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ చూస్తే కేవలం రూ. 1.50 (కొట్టిన్నర) మాత్రమే వచ్చింది.

'డ్యూడ్' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 59 కోట్లు కాగా... 'తెలుసు కదా' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే... ప్రదీప్ రంగనాథన్ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమా అయితే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే చాలు. ప్రజెంట్ బజ్ చూస్తే... 'డ్యూడ్'కు కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు కనబడుతోంది.

Also Read: కాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!