Pradeep Ranganathan's Dude First Day Box Office Collection: దీపావళి పండక్కి 'డ్యూడ్'తో థియేటర్లలోకి వచ్చారు ప్రదీప్ రంగనాథన్. 'లవ్ టుడే, 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (తమిళంలో 'డ్రాగన్') తర్వాత ఆయన నటించిన చిత్రమిది. ప్రదీప్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు యాడ్ అయ్యింది. దాంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది.

ఇండియాలో అదరగొట్టావ్ 'డ్యూడ్'!
Net Collection Of Dude - First Day In India: ఇండియాలో మొదటి రోజు 'డ్యూడ్' మూవీ పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ నెట్ కలెక్షన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం రిపోర్ట్ చూస్తే... తమిళంలో ఆరున్నర కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. తెలుగులో మూడు కోట్ల రూపాయలకు ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

Dude Box Office Collection India Net: తమిళంలో రూ. 6.75 కోట్లు, తెలుగులో రూ. 3.25 కోట్లు... అక్టోబర్ 18న ఎర్లీ రిపోర్ట్స్ చూస్తే 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇండియా నెట్ కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు డబుల్ డిజిట్ మార్క్ చేరుకుంది 'డ్యూడ్'. ఓవర్సీస్ కలెక్షన్స్ యాడ్ చేసి గ్రాస్ చూస్తే రూ. 15 కోట్లు కంటే ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

Also Read: డ్యూడ్ vs తెలుసు కదా... బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? సిద్ధూ, ప్రదీప్... ఎవరి సినిమాకు క్రేజ్ ఎక్కువ

ప్రదీప్ రంగనాథన్ సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు నటించిన 'డ్యూడ్'లో శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. హీరోయిన్ తండ్రిగా, హీరోకి మేనమామగా కనిపించారు. హీరో తల్లి పాత్రలో రోహిణి నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ సత్య, నేహా శెట్టి తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ డైరెక్షన్ చేయగా... మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేశారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు.

Also Read: కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ: డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ... కిరణ్ అబ్బవరం సినిమా ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటంటే?