Richard Rishi's Draupadi 2 Movie Shooting Completed: రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ద్రౌపది 2' సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు మూవీ టీం తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 14వ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా మూవీలో చూపించబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ మూవీకి మోహన్.జి దర్శకత్వం వహిస్తుండగా... జీఎం ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై చోళ చక్రవర్తి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజువల్స్‌తో రాబోతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దర్శక నిర్మాతలు 'ద్రౌపది 2' చిత్ర విశేషాల్ని షేర్ చేసుకున్నారు. <!--EndFragment -->
సవాళ్లు ఎదురైనా...
సినిమా షూటింగ్ టైంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ప్రొడ్యూసర్ సపోర్ట్‌తోనే పూర్తి చేసినట్లు డైరెక్టర్ మోహన్ తెలిపారు. 'దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. నిర్మాత చోళ చక్రవర్తికి ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్‌ వల్లే ఇంత గ్రాండ్‌గా చిత్రీకరించగలిగాం. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వడంతో ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించానని అనుకుంటున్నా.' అని అన్నారు.
ముందుగానే పూర్తి
డైరెక్టర్ మోహన్ డెడికేషన్‌తో అనుకున్న టైం కన్నా ముందే షూటింగ్ పూర్తి చేయగలిగామని ప్రొడ్యూసర్ చోళ చక్రవర్తి అన్నారు. 'డైరెక్టర్ జి.మోహన్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. నిర్మాతగా నాకు ఉండే ఎన్నో అనుమానాల్ని ఆయన నివృత్తి చేసిన విధానం నాకు నచ్చింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్. మోహన్ సపోర్ట్ వల్లే ఈ తరహాలో మరిన్ని చిత్రాలు నిర్మించాలనే నా సంకల్పం మరింత బలమైంది.' అని చెప్పారు.<!--EndFragment -->
Also Read: రాణి ముఖర్జీ , కాజోల్.. అక్కాచెల్లెలు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు? ఒకరికి లండన్లో కూడా బంగ్లా ఉంది!
డిసెంబరులో రిలీజ్
ఈ మూవీలో రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే <!--StartFragment -->నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామ్మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. గిబ్రాన్ వైబోధ మ్యూజిక్ అందించారు. సినిమాను డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.<!--EndFragment -->
'ద్రౌపది 2' మూవీ నటీనటులు : <!--StartFragment -->బ్యానర్: జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌, నేతాజీ ప్రొడక్షన్స్‌, నిర్మాత: చోళ చక్రవర్తి, దర్శకుడు: మోహన్.జి, సంగీతం: గిబ్రాన్ వైబోధ, డైలాగ్స్: పద్మ చంద్రశేఖర్, మోహన్ జి, సినిమాటోగ్రఫీ: ఫిలిప్ ఆర్. సుందర్, కొరియోగ్రఫీ: థానికా టోనీ, స్టంట్ కోఆర్డినేషన్: యాక్షన్ సంతోష్, ఎడిటింగ్: దేవరాజ్, ఆర్ట్ డైరెక్షన్: కమల్నాథన్.