Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
3 months ago 8
ARTICLE AD
Draksharamam Bheemeswara Swamy temple:  అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం  ద్రాక్షారామం భీమేశ్వర స్వామి  ఆలయంలో చోటుచేసుకున్న విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అసలు కారణాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ  రాహుల్ మీనా  బుధవారం అమలాపురంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను ప్రకటించారు.
ఈ అపచారానికి పాల్పడిన వ్యక్తిని రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు హిందూ మతానికి చెందినవాడేనని, ఈ ఘటన వెనుక ఎటువంటి రాజకీయ కుట్రలు లేదా మతపరమైన కోణాలు లేవని ఎస్పీ స్పష్టం చేశారు. కేవలం తన వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి, దేవుడి విగ్రహాన్ని పావుగా వాడుకున్నాడని విచారణలో తేలింది.
నిందితుడు శ్రీనివాస్ కు, ఆలయ సిబ్బందికి మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక కాలువ స్థల వివాదం  కారణంగా నిందితుడికి, ఆలయ ఉద్యోగులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టాలని, వారిపై కేసులు వచ్చేలా చేయాలని శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. తానూ వెళ్లి ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేస్తే, ఆ నింద సిబ్బందిపై పడుతుందని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
పోలీసుల రికార్డుల ప్రకారం.. నిందితుడు శీలం శ్రీనివాస్ పై గతంలోనే   నేర చరిత్ర ఉంది.  గొడవలు పడటం, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం ఇతనికి అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన అమలాపురం పోలీసులు, నిందితుడిని పట్టుకున్నారు. తానే నేరం చేసినట్లుగా శ్రీనివాస్ అంగీకరించాడు.
Read Entire Article