Types of Divorce and Rules in India : సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న వాటిలో డివోర్స్ ఒకటి. ముఖ్యంగా సెలబ్రెటీల డివోర్స్ ఈ టాపిక్కు ఆజ్యం పోస్తున్నాయి. అన్యోన్యంగా కనిపించిన దంపతులు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. వారు విడిపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే డివోర్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయట. ఈ డివోర్స్ లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో.. ఆ రకాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

విడాకుల్లో రకాలు ఇవే

విడాకులు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి సమ్మతితో కూడిన విడాకులు (Mutual Consent Divorce), మరొకటి ఎవరో ఒకరు కోరుకునే విడాకులు (Contested Divorce).

పరస్పర అంగీకారం (Mutual Consent Divorce)

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించే వాటిలో ఈ డివోర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇద్దరూ వ్యక్తులు ఇష్టంతో.. కలిసి ఉండమంటూ తీసుకునే విడాకులను Mutual Consent Divorce అంటారు. దీనిలో పెద్ద గొడవలు ఏమి ఉండవు. భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తి వంటి అన్ని నిబంధనలను ఇద్దరూ ఓకే విడాకులకు అప్లై చేయవచ్చు. ఈ ప్రక్రియలో పిటిషన్ దాఖలు చేయడం, టైమ్ పీరియడ్, విడాకులను ఓకే చేయడం వంటివి ఉంటాయి. టైమ్ పీరియడ్ అంటే విడాకులకు అప్లై చేసిన తర్వాత మంజూరు కోసం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

గొడవలతో కూడినవి (Contested Divorce)

ఫిజికల్గా, మానసికంగా అబ్యూజ్ చేయడం, మానసిక రుగ్మతలు, లైంగిక సంబంధమైన వ్యాధులు ఇతరత్రా సీరియస్ విషయాల్లో ఈ తరహా డివోర్స్ ఎక్కువ జరుగుతాయి. దంపతుల్లో ఒకరు ఈ తరహా రీజన్స్ చూపించి.. అవతలి వ్యక్తితో డివోర్స్ తీసుకోవచ్చు. అయితే వారు చూపించే ప్రతి కారణానికి నిర్దిష్టమైన సాక్ష్యం ఉండాలి. చట్టపరమైన వాదనలు కోర్టులో సబ్మీట్ చేయాల్సి ఉంటుంది.

డివోర్స్ లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..

విడాకులు తీసుకోవాలనుకునేవారు కచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మీట్ చేయడం, లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వడం చేయాలి. ముందుగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయాలి. ఆ పిటిషన్లో విడాకులకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలి. అవసరమైన పత్రాలు, సాక్ష్యాలు సిద్ధం చేసుకోవాలి.

డాక్యుమెంట్స్

ఈ క్రమంలో లీగల్ ప్రాసెస్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మీట్ చేయాలి. వివాహ ధృవీకరణ పత్రాలు, ఇంటి అడ్రెస్, ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్స్, విడాకుల కారణాలను తెలిపే ఆధారాలు సిద్ధం చేసుకోవాలి. విడాకులు తీసుకునే రకం, తీసుకునే అవసరం బట్టి ఈ డాక్యుమెంట్స్ మారుతూ ఉంటాయి.

ఫ్యామిలీ కోర్టు పాత్ర

వివాహ వివాదాలను పరిష్కరించే న్యాయస్థానాలను ఫ్యామిలీ కోర్ట్స్ అంటారు. విడాకుల వంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఇవి కృషి చేస్తాయి. కలిసి ఉండేలా సూచించడం, విడిపోకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడం వంటివి చేస్తాయి. ఇద్దరూ ఒకటే మాటపై విడిపోవాలనుకున్నప్పుడు మాత్రం డివోర్స్ని మంజూరు చేస్తాయి. చట్టపరంగా విడిపోయేందుకు ఈ విడాకులు హెల్ప్ చేస్తాయి.

Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి

భరణం

విడాకుల్లో భరణం అనేది కీలకపాత్ర పోషిస్తుంది. జీవిత భాగస్వామి ఆదాయం, వివిహా సమయంలో ఇచ్చిన మొత్తం, వివాహ వ్యవధి, విడాకుల తర్వాత బతకడానికి సంపాదన, జీవిత భాగస్వామి సామర్థ్యం వంటి అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుని ఇవ్వాల్సిన భరణంపై సూచనలు ఇస్తుంది. విడాకుల తర్వాత భాగస్వామి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవడమే దీని లక్ష్యం.
భరణం అనేది మారుతూ ఉంటుంది. హిందూ చట్టం ప్రకారం.. భరణం అనేది ఒకేసారి చెల్లించవచ్చు. లేదా లైఫ్ లాంగ్ చెల్లింపు ఉండొచ్చు. ముస్లిం చట్టాలలో షరియా ఉంటుంది. ఈ చట్టం పక్రారం మహర్ అనే ప్రక్రియ ద్వారా భరణం చెల్లించాల్సి ఉంటుంది.

చైల్డ్ కస్టడీ

విడాకులు తీసుకునేవారికి పిల్లలుంటే.. వారి సంక్షేమాన్ని ఫ్యామిలీ కోర్టులు ప్రధాన అంశంగా తీసుకుంటాయి. పిల్లల వయసు, లింగం, పిల్లలను పోషించే తల్లిదండ్రుల సామర్థ్యం.. కొన్ని సందర్భాల్లో పిల్లల సొంత ప్రాధాన్యతలు వంటి అంశాలను కోర్టులు పరిగణలోకి తీసుకుని.. చైల్డ్ కస్టడీని నిర్ధారిస్తాయి.

Also Read : Gen Zలకు సోకుతున్న డేంజర్ డిసీజ్‌- ట్రెండ్‌గా మారుతున్న డివోర్స్ ఇన్ ద ఎయిర్

ఆస్తి విభజన

ఇండియాలో విడాకుల కేసుల్లో ఆస్తి విభజన ఉంటుంది. న్యాయస్థానాలు వీటిని సమాన పంపిణీ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతాయి. అలాగే జీవిత భాగస్వామి చేసే వృత్తిని కూడా పరిగణలోకి తీసుకుంటాయి.

మరిన్ని..

మీరు ఎంచుకునే లాయర్స్, లీగల్ అడ్వైజర్స్ కూడా విడాకుల్లో ప్రధానమే. వారు మీకు ప్రొపర్ గైడెన్స్ ఇచ్చే వారై ఉండాలి. డివోర్స్ మంజూరయ్యే సమయం, వాదనలు, లీగల్ ప్రాసెస్లపై మీకు అవగాహన కల్పించాలి. ఈ ప్రాసెస్లో మీకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఇది మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోవాలనే నిర్ణయం కూడా మారొచ్చు. దీని తర్వాత కూడా మీరు డివోర్స్ తీసుకోవాలనుకుంటే కోర్టు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని విడాకులు మంజూరు చేస్తుంది.

Also Read : IPC 69 సెక్షన్ గురించి తెలుసా? అబ్బాయిలైతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే