Divorce News: ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు చేసిన భార్య - క్రూరత్వమేనని విడాకులు ఇచ్చిన కోర్టు

2 months ago 7
ARTICLE AD

Wife refusal to eat onion divorce granted to husband: అనురాగంతో వెలగాల్సిన ఆ సంసారంలో ఉల్లి, వెల్లుల్లి చిచ్చు రేపాయి. తన ఆహారపు అలవాట్లపై ఆమెకున్న విపరీతమైన పట్టింపులు,  ఆచారాల పట్ల ఆమె ప్రదర్శించిన  ధోరణి ఆ ఇంట అశాంతిని నింపాయి. భర్త ఇష్టాయిష్టాలను కాదని, వంటగదిపై తన  నియంతృత్వాన్ని చెలాయిస్తూ, ఉల్లిపాయ కనీసం ఇంటి గడప దాటడానికి కూడా వీల్లేదని ఆమె పెట్టిన నిబంధనలు ఆ కాపురాన్ని  కూల్చివేశాయి. కేవలం ఆహార నియమాలే కాకుండా, ఆమె ప్రవర్తనలోని తీవ్రమైన మొండితనం చివరకు ఆ భర్తను న్యాయస్థానం మెట్లు ఎక్కేలా చేసింది.

గుజరాత్ కు చెందిన జంటకు ఈ పరిస్థితి ఎదురయింది. కింది కోర్టు విడాకులు మంజూరు చేస్తే దాన్ని సవాల్ చేస్తూ ఆ భార్య హైకోర్టును ఆశ్రయించింది.  విచారణ సందర్భంగా ఆ భర్త వినిపించిన వాదనలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సమాజంలో కలిసిమెలిసి ఉండాల్సిన భార్య, తన వింత పోకడలతో అతడిని ఒంటరిని చేసింది. ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారాన్ని బలవంతంగా తినిపించడమే కాకుండా, తన మతాచారాలను భర్తపై రుద్దడానికి ప్రయత్నించేదని ఆయన వాపోయారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలు, భార్య ప్రవర్తన వల్ల తాను సామాజికంగా ఎదుర్కొన్న అవమానాలు తనను మానసిక కుంగుబాటుకు గురిచేశాయని, తన జీవితం ఒక గందరగోళంగా మారిందని ఆయన కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వింత కేసును విచారించిన న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య ప్రదర్శించిన ఆ అతి  పట్టుదలను, మతోన్మాద ధోరణిని   కోర్టు తప్పుపట్టింది. కేవలం ఆహారపు అలవాట్లకే పరిమితం కాకుండా, ఒక మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, నిరంతరం ఒత్తిడికి గురిచేయడం  మానసిక క్రూరత్వం' కిందకే వస్తుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. భర్తపై ఆమె చూపిన ఈ ప్రవర్తన కారణంగా వారు కలిసి ఉండటం అసాధ్యమని భావించిన కోర్టు, సదరు భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

నూరేళ్ల బంధం ఇలా వంటగది అలవాట్ల దగ్గర ముగిసిపోవడం అందరినీ ఆలోచింపజేస్తోంది. మతాచారాలు, అలవాట్లు వ్యక్తిగతంగా ఉండాలే తప్ప, ఎదుటివారికి అవి వేధింపులుగా మారకూడదని ఈ తీర్పు స్పష్టం చేసింది. తన పంతమే నెగ్గాలనుకున్న ఆ భార్య పట్టింపుల ముందు, వారి వివాహ బంధం చిన్నబోయింది. చివరకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఆ భర్తకు మానసిక నరకం నుండి విముక్తి లభించినట్లయింది.

Read Entire Article