అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju)కు నాగవంశీ సూర్యదేవర (Suryadevara Naga Vamsi) షాక్ ఇచ్చారా? వాళ్ళిద్దరి మధ్య వ్యాపార బంధం తెగిందా? స్నేహంలోకి చిన్నపాటి మార్పులు చోటు చేసుకుంటున్నాయా? అంటే... తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్పష్టమైన సమాధానం ఏదీ రావడం లేదు. కానీ, 'ఫంకీ' డిస్ట్రిబ్యూషన్ 'దిల్' రాజు నుంచి మరొక చేతికి వెళ్లిందని స్పష్టమైన సమాచారం అందుతోంది.

'దిల్' రాజుకు నాగవంశీ షాక్!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్'కు నాగవంశీ వచ్చినప్పుడు 'దిల్' రాజు గారిని ఆ రెడ్ కలర్ ప్యాంట్స్ వేసుకోవడం మానేయమని చెప్పాలన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం గురించి చెప్పడానికి అదొక ఉదాహరణ. తెలుగు చిత్రసీమలో వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేసే నిర్మాతలలో నాగవంశీ ఒకరు. ఆయన నిర్మించే సినిమాలను నైజాం (తెలంగాణ)లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఇన్నాళ్లూ! 'అనగనగా ఒక రాజు' ప్రెస్ & సక్సెస్ మీట్స్‌లో 'దిల్' రాజు కనిపించారు. త్వరలో రాబోయే నాగవంశీ సినిమా మీట్స్‌లో ఆయన కనిపించరు ఏమో!?

Also Read: Dhurandhar 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు 'ధురంధర్ 2' షాక్... మరో ఓటీటీకి రణవీర్ సింగ్ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌... ఇప్పుడు 'ధురంధర్: ది రివేంజ్' ను ఎందులో చూడాలంటే?

ఇప్పుడు 'దిల్' రాజుకు షాక్ ఇస్తూ... విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో నిర్మించిన 'ఫంకీ' డిస్ట్రిబ్యూషన్ హక్కులను నాగవంశీ మరొకరికి ఇచ్చారని తెలిసింది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు 'ఫంకీ' నైజాం రైట్స్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ నేతృత్వంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిర్వహిస్తారట.

Also Read: Dhurandhar 2 Teaser Review: ధురంధర్ 2 కాదు... రణవీర్ సింగ్ 2.ఓ - టీజర్‌లో లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ & యాక్షన్ నెక్ట్స్‌ లెవల్

View this post on Instagram

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

నైజాంలో 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ - సురేష్ బాబు (సురేష్ ప్రొడక్షన్) బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ అండతో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. ఇప్పుడు మరొక కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థను తెరపైకి తీసుకు వస్తున్నారని, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు పోటీగా నాగవంశీ, బాపినీడు, సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు కొత్త సంస్థను యాక్టివ్ చేస్తున్నారట. అదీ సంగతి. మరి, 'దిల్' రాజు ఏం చేస్తారో చూడాలి.

Also Read: ఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్