Dil Raju condemned the comments made by KTR on the meeting with Revanth: సినీ ఇండస్ట్రీతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు రహస్యంగా జరిపినవి కావని చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. చిత్రపరిశ్రమతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి దాపరికాల్లేకుండా జరిగిన ఈ సమావేశంలో పూర్తి స్నేహభావంతో జరిగిందనద్నారు. ఈ సమావేశం విషయంలో చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా సహకారం అందచేయాలని సీఎం కోరారన్నారు.

హైదరాబాద్‌ను గ్లోబర్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలన్న సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర సీమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించామన్నారు. అనవసర వివాదాల్లోకి..రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగవద్దని కేటీఆర్‌కు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందర్నీ కోరుతున్నామన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం , ప్రజల ప్రోత్సాహం ఎప్పటికి ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.

pic.twitter.com/m6VhQmda0C

— Chairman - Film Development Corp (@TGFDC_Chairman) December 31, 2024