Eat these Foods to Control Diabetes : మధుమేహం ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో చాలా మార్పులు చేయాలి. కానీ ఈ విషయం తెలియక చాలామంది స్వీట్స్ మానేస్తే సరిపోతుందనుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. షుగర్ కంట్రోల్ చేసేందుకు స్వీట్స్ మానేయడంతో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల బరువు కంట్రోల్ ఉండడంతో పాటు.. డయాబెటిస్ అదుపులో ఉంటుందని చెప్తున్నారు.

ఎండోక్రైనాలజిస్టులు, న్యూట్రిషనిస్టుల ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలట. ఎందుకంటే హై-ఫైబర్ ఆహారం జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి ఒక్కసారిగా చేరకుండా.. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. మరి డయాబెటిస్ను కంట్రోల్‌ చేసే ఫైబర్ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.

ఓట్స్

ఓట్స్‌లో ఉండే సొల్యూబుల్ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటే రోజంతా ఎనర్జీతో పాటు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

పప్పులు

పప్పులు అంటే కందిపప్పు, పెసరపప్పు, రాజ్మా వంటి వాటిలో ఫైబర్‌తో పాటు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీల్ వస్తుంది. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి.

ఆకుకూరలు

పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లకు మేలు జరుగుతుంది.

కూరగాయలు

బ్రోకలీ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయాలు బ్లడ్ షుగర్‌పై పెద్దగా ప్రభావం చూపవు. రోజూ భోజనంలో వీటిని ఉడికించి లేదా కర్రీ రూపంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్లో ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

పండ్లు

పండ్లు తీసుకోవడం అంటే అన్నీ కాదు. ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న జామ, యాపిల్ వంటి పండ్లు మాత్రమే తీసుకోవాలి. పండ్లను జ్యూస్‌గా కాకుండా పూర్తిగా తినడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ తరహా ఫుడ్స్ డైట్లో చేర్చుకుంటే షుగర్ కచ్చితంగా అదుపులో ఉంటుందని, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే మీల్స్ ఎప్పుడూ ఒకేసారి కాకుండా.. చిన్న చిన్న మోతాదుల్లో రెగ్యులర్ టైమ్స్‌ ఫాలో అవుతూ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వైద్యులు సూచించే మందుల తీసుకుంటూ.. వ్యాయామాలు చేస్తూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెప్తున్నారు. తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ అయినా చేస్తూ ఉండాలని అంటున్నారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.