హిందీలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాపులర్. ముఖ్యంగా ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ 'ఆజ్ కి రాత్', 'గఫూర్' వైరల్ అయ్యాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అని తమన్నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఓ పాటలో తమన్నాను తీసేసి మరొకరికి అవకాశం ఇచ్చారని వచ్చిన వార్తలపై, ఆ పాట చేసిన క్రిస్టల్ రియాక్ట్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే...

తమన్నా భాటియాను 'ధురందర్' చిత్రంలోని డాన్స్ నంబర్ 'షరారత్' కోసం మొదటి సెలక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఆ పాటలో నటించిన నటి క్రిస్టల్ డిసౌజా సదరు వార్తలపై రియాక్ట్‌ అయ్యింది.

తమన్నా గురించి క్రిస్టల్ ఏమన్నారంటే?
ఫ్రీప్రెస్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా కూడా 'షరారత్' పాటను అద్భుతంగా చేయగలదని భావిస్తున్నట్లు క్రిస్టల్ తెలిపారు. ఇంకా క్రిస్టల్ మాట్లాడుతూ... "నిజం చెప్పాలంటే, సోషల్ మీడియాలో డిస్కషన్ చూశా. తమన్నాకు అవకాశం వచ్చిందా? లేదా? అన్నది పక్కన పెడితే... ఆమె అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుందని నాకు కచ్చితంగా తెలుసు. అయేషా ఖాన్ సోలోగా పాటలో ఉన్నా... ఆమె కూడా మరింత అద్భుతంగా చేసేది. నేను ఒంటరిగా ఉన్నా... అద్భుతంగా చేసేదాన్ని. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తారు" అని పేర్కొన్నారు.

ఒకరిని పైకి లేపడానికి ఇతరులను కించపరచవద్దు
క్రిస్టల్ ఇంకా మాట్లాడుతూ... "కష్టపడి పని చేయడంతో పాటు స్వయంకృషితో ఎదిగిన, నిరంతరం ప్రయత్నించే వ్యక్తులను, కృషి చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరి శ్రమనూ నేను తక్కువ అంచనా వేయను. తమన్నా గొప్ప సినిమాలు చేస్తోందని నేను భావిస్తున్నా. ఆమె మరిన్ని గొప్ప సినిమాలు చేస్తుంది, చేయాలి. అందరికీ తగినన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రణ్‌వీర్ సింగ్ లాగా మెరవాలి, మమ్మల్ని కూడా మెరవనివ్వండి. ఒకరిని పైకి లేపడానికి ఇతరులను కించపరచాల్సిన అవసరం లేదు. మానసికంగా ఒకరిని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలియదు" అని తెలిపారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్'లోని డాన్స్ నంబర్ 'షరారత్'ను అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాపై చిత్రీకరించారు.

Also Read: Akhanda 2 OTT - వాయిదాల్లేవ్... ఈ వారమే 'అఖండ 2' ఓటీటీ రిలీజ్... ఐదు భాషల్లో స్ట్రీమింగ్ - ఎందులో, ఎప్పట్నుంచి చూడొచ్చంటే?

View this post on Instagram

A post shared by Saregama India (@saregama_official)

కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ కొన్ని రోజుల క్రితం 'ధురందర్' చిత్రంలోని 'షరారత్' డాన్స్ నంబర్ కోసం తమన్నా భాటియాను మొదటి ఎంపిక చేశామని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, తరువాత ఆమెను పాట కోసం ఎప్పుడూ 'సంప్రదించలేదు, అలాగని తిరస్కరించనూ లేదు' అని స్పష్టం చేశారు. దర్శకుడు ఆదిత్యకు పాటలో ఇద్దరు డ్యాన్సర్లు ఉంటే బావుంటుందని అనిపించిందని, చివరికి అయేషా, క్రిస్టల్ డిసౌజాను ఎంచుకున్నామని తెలిపారు.

Also Read: Maa Inti Bangaaram: సంక్రాంతికి ముందు సమంత బ్లాస్ట్... 'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?