Ranveer Singh's Dhurandhar Movie OTT Release Date Locked : గతేడాది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్'. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తక్కువ టైంలోనే రికార్డు కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

'ధురంధర్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుండగా... ఈ నెల 30 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు నేషనల్ మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

రికార్డు కలెక్షన్స్

ఈ మూవీ ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. త్వరలోనే రూ.1300 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియావ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ హిందీ మూవీగా నిలిచింది. బాలీవుడ్‌లో ఏ ఇతర మూవీకి సాధ్యం కాని ఫీట్‌ను తక్కువ టైంలోనే సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Also Read : మహేష్, రాజమౌళి 'వారణాసి' రిలీజ్ డేట్ ఫిక్స్! - 'శ్రీరాముడు' వచ్చేది ఎప్పుడంటే?