Dhurandhar Music Director Telugu Debut Movies : బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

నిఖిల్ మూవీ కోసం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న మూవీ 'ది ఇండియా హౌస్'. ఈ మూవీకి సచ్‌దేవ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే 5 సాంగ్స్ కంపోజ్ చేయగా... బీజీఎం, మ్యూజిక్ అవుట్ పుట్ పట్ల టీం ఫుల్ జోష్‌లో ఉందని తెలుస్తోంది. మెలోడీ సాంగ్స్‌తో పాటు యాక్షన్ బీజీఎం వేరే లెవల్‌లో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. స్టోరీకి తగ్గట్లుగా డిఫరెంట్‌గా ఈ సాంగ్స్ కంపోజ్ చేశారట. రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ అంటేనే ఓ భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... సచ్‌దేవ్ మ్యూజిక్‌తో ఆ హైప్ పదింతలైంది.

ఈ మూవీలో నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా... స్వాతంత్ర్యానికి ముందు లండన్‌లో భారతీయ విప్లవకారుల కథాంశం బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాలో క్యూట్ లవ్ స్టోరీని కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా ఇది మరో ప్లస్. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : థియేటర్లలో చిన్న సినిమాలు - ఓటీటీల్లో 'సంక్రాంతి' లేటెస్ట్ మూవీస్... మూవీస్/ వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్