తెలుగులో శ్రీ లీల (Sreeleela)కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు ఆవిడను వెంటాడుతున్నాయి. బాలకృష్ణ 'భగవంత్ కేసరి' తర్వాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్ ఆవిడ ఖాతాలో లేదు. మహేష్ బాబు 'గుంటూరు కారం' పర్వాలేదనిపించుకోగా... 'పుష్ప 2' విజయం సాధించడంతో ఆ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ ఒక్కటే ఊరట ఇచ్చింది. మిగతా సినిమాలు అన్నీ ఫ్లాప్. ఈ తరుణంలో తమిళ చిత్రసీమ నుంచి ఆవిడకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ధనుష్ సినిమా అవకాశం శ్రీ లీల తలుపు తట్టింది.

ధనుష్ జంటగా శ్రీ లీల!
Dhanush 55 Movie Heroine: కొత్త ఏడాది (2026లో) తమిళ చిత్రసీమకు శ్రీ లీల కథానాయికగా పరిచయం అయింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ సరసన 'పరాశక్తి'లో నటించింది. సంక్రాంతికి తమిళనాట విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితేనేం... తాజాగా మరొక అవకాశం ఆమెకు వచ్చింది.

Also Read: Surya 46 Movie Title: వెంకీతో సూర్య సినిమాకు టైటిల్ అదేనా? క్లాసిక్ హిట్ సెంటిమెంట్ కలిసి వచ్చేలా?

ధనుష్ సినిమా చేసే అవకాశాన్ని శ్రీ లీల అందుకున్నారని గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్నారు. అందులో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేశారు. ఈ రోజు ఆ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'డ్యూడ్' ఫేమ్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Also Read: Singeetam Srinivasa Rao: 94 ఏళ్ళ వయసులో దర్శకత్వం... నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం కొత్త సినిమా

You didn't see this coming 😉

Welcoming the dazzling damsel @sreeleela14 on board #D55 🔥@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr @vishurams pic.twitter.com/fROtGwO0T2

— Wunderbar Films (@wunderbarfilms) January 31, 2026

ధనుష్ - రాజ్ కుమార్ పెరియసామి సినిమాలో కథానాయికగా శ్రీ లీల లేదా పూజా హెగ్డేను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తొలుత వినిపించింది. 'అమరన్' సినిమా విజయంలో సాయి పల్లవి నటన ప్రముఖ పాత్ర పోషించింది. అందుకని దర్శకుడు మరొకసారి ఆమెను రిపీట్ చేయవచ్చని భావించారు. కానీ, ఆ అవకాశం శ్రీ లీలకు దక్కింది. ధనుష్ సినిమా అంటే తెలుగులో కూడా క్రేజ్ ఉంటుంది. అది హిట్ అయితే ఇక్కడ కూడా ఆవిడ పంట పండినట్లే. ధనుష్ సినిమా హిట్ అవ్వడం శ్రీ లీలకు చాలా ఇంపార్టెంట్. అలాగే, హిందీలో చేస్తున్న సినిమా కూడా సక్సెస్ అవ్వాలి.

Also Read: Gatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?