Dhanteras 2025: ధన త్రయోదశి రోజు చీపురు కొనడం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? అసలు కారణం ఏంటి?

1 month ago 2
ARTICLE AD

Dhanteras 2025: ఏటా దీపావళికి రెండు రోజుల ముందు ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజు నుంచే దీపావళి పండుగ సందడి ప్రారంభమవుతుంది. వరుసగా ధనత్రయోదశి, నరకచతుర్థశి, దీపావళి, బలి పాడ్యమి, యమవిదియ...5 రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజమాసం బహుళ పక్షంలో వచ్చే ధన త్రయోదశి రోజుని  ధనం , ఆరోగ్యం కోసం జరుపుకునే పండుగగా భావిస్తారు. ఈ రోజు భగవాన్ ధన్వంతరిని పూజిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో అమృత కలశంతో ఆవిర్భవించాడు ధన్వంతరి. అందుకే అమృతాన్ని ప్రసాదించి దీర్ఘావుయును ప్రసాదించమన ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే ఇంట్లో సంతోషం, సంపద పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

2025 ధన త్రయోదశి తేదీ, బంగారం కొనుగోలు చేసేందుకు శుభ ముహూర్తం తెలుసుకోండి!

ధన త్రయోదశి రోజు చీపురు కొనుగోలు చేస్తారు..దీనివెనుక మతపరమైన కారణాలేంటో తెలుసా?

చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు చీపురు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టే అని భావిస్తారు.

ఈ రోజు చీపురు కొని ఇంటికి తీసుకొస్తే సంతోషం, ధనం పెరుగుతుందని..దారిద్ర్యం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది..అందుకే చెత్తను తొలగించే చీపురును ధన త్రయోదశి రోజు ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని చెబుతారు.

హిందూ సాంప్రదాయంలో అలక్ష్మి (దారిద్ర్యం మరియు అశుభం యొక్క దేవత) శుభ్రత లేని ప్రదేశాలలో నివసిస్తుందని చెబుతారు. కొత్త చీపురు కొనడం ద్వారా ఇంటిని శుభ్రం చేసి, అలక్ష్మిని దూరం చేసి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం ఉంది.

లక్ష్మీదేవికి ప్రతీక

హిందూ ధర్మశాస్త్రాలు ప్రకారం చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు . శుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవికి శుభప్రదంగా ఆహ్వానం పలుకుతుందని నమ్ముతారు

దారిద్ర్య నాశనం

చీపురు ఇంట్లో నాకరాత్మక శక్తి, దారిద్ర్యం ని దూరం చేస్తుంది, ఇది సాకారాత్మకతని పెంచుతుంది. కొత్త చీపురుతో చెత్తను, దారిద్ర్యాన్ని తొలగించి సంపదను ఆహ్వానిస్తున్నాం అనేందుకు సూచన

ఆర్థిక సమృద్ధి

ధన త్రయోదశి రోజు చీపురు కొనుగోలు చేస్తే ఇంట్లో ధనం పెరుగుతుంది..ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పనికిరానివాటిని తొలగించి సానుకూల శక్తి నింపడం ద్వారా సంపద పెరుగుతుందని నమ్మకం

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

దీపావళి నుంచి 6 నెలల పాటూ ఈ 5 రాశుల వారి అదృష్టం వెలిగిపోతుంది! మీ రాశి ఉందా ఇందులో తెలుసుకోండి

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article