<p><strong>Delhi Elections:</strong> ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఫిబ్రవరి ఐదో తేదీన జరుగుతుంది. ఎనిమిదో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ ఒకే విడతలో జరుగుతుంది. </p>
<p><br />గత ఏడాది జరిగిన అన్ని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారని గుర్తు చేశారు.దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందన్నారు. ఇక, ఓట్ల తొలగింపు ఆరోపణలను సైతం ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీలంతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయి.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. </p>