ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం (నవంబర్ 10, 2025)న కారులో భారీ పేలుడు సంభవించింది, దీని కారణంగా మొత్తం ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఈ పేలుడులో 11 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్పించారు. పేలుడు తీవ్రత కారణంగా సమీపంలో ఉన్న అనేక వాహనాలకు మంటలు అంటుకోగా, మరికొన్ని కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుడు తర్వాత పోలీసులు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు.

అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఒక బులెట్ కనిపించింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ, జాతీయ భద్రతా గార్డు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎర్రకోట సమీపంలో పేలుడుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు

1. ఢిల్లీ ఫైర్ బ్రిగేడ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, "ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్-ఒకటి సమీపంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు సంభవించింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం 7:29 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు." పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది, అందులో మండుతున్న కార్ల నుంచి మంటలు, పొగలు వస్తున్నట్లు చూడవచ్చు.

2. LNGP ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, "15 మందిని లోక్ నాయక్ ఆసుపత్రికి తీసుకువచ్చారు, వారిలో 8 మంది ఆసుపత్రికి తీసుకువచ్చే ముందే మరణించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరి పరిస్థితి స్థిరంగా ఉంది." ఇప్పుడు విషమంగా ఉన్న వాళ్లు కూడా మరణించారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది.

3. ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, "నేను గురుద్వారాలో ఉన్నాను, అప్పుడు పెద్ద శబ్దం విన్నాను. ఆ శబ్దం ఎంత పెద్దగా ఉందంటే అది దేని వల్ల వచ్చిందో మాకు అర్థం కాలేదు. పేలుడు కారణంగా సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి."

4. ఎర్రకోటకు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు.మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. అదే సమయంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు NIA, NSG బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

5. ఎర్రకోటకు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు. మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. అదే సమయంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు NIA, NSG బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్, IB చీఫ్‌తో మాట్లాడి ఘటన గురించి సమాచారం తెలుసుకున్నారు.

6. ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, కారులో పేలుడు ఏర్పడింది, ప్రతి కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6:52 గంటలకు పేలుడు గురించి సమాచారం అందిందని చెప్పారు."

7. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఈ పేలుడు గురించి సమాచారం తెలుసుకున్నారు.